Leading News Portal in Telugu

Minister Roja Emotional: కన్నీటి పర్యంతమైన మంత్రి రోజా.. రేపు లోకేష్ భార్యకు ఇదే పరిస్థితి..!


Minister Roja Emotional: ఏపీ మంత్రి ఆర్కే రోజా కన్నీటి పర్యంతమయ్యారు.. దేశం మొత్తం 33 శాతం రిజర్వేషన్ పై సంతోషించాలా.. లేక బండారు సత్యనారాయణ లాంటి వాళ్లు మాట్లాడినా మాటలకు రాజకీయాల్లో భయపడి రారేమో అని అనుమానం వ్యక్తం చేశారు.. మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసినా నాపై అత్యంత దారుణంగా మాట్లాడారు.. ఆ మాటలు ఎవరు విన్న బండారును చెప్పుతో కోట్టకుండా ఉండరు.. లోకేష్ సహా ఇతరుల ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉన్నారు.. వాళ్లు తిడితే మీకు ఓకేనా? అంటూ కన్నీటి పర్యంత అయ్యారు మంత్రి రోజా.. మీ ఇంట్లో ఉండేవాళ్లు మాత్రమే ఆడవాళ్లు.. మేం మహిళలు కాదు.. మాకు మనసు లేదా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండారు మాట్లాడిన మాటలకు ఆయన భార్య, కూతురు చెప్పుతో కొట్టిఉంటే అప్పుడు బాగుండేది.. మరో మహిళను అలా తిట్టరు అని వ్యాఖ్యానించారు మంత్రి రోజా.. సిగ్గు లేకుండా లోకేష్ ట్వీట్ చేశాడు.. పదేళ్లు టీడీపీ కోసం పనిచేశాను.. మీ పార్టీలో ఉంటే మంచిదాన్ని.. మీ పార్టీ నుండి బయటకు వస్తే చెడ్డది అని ముద్రవేస్తారా.? అని ఆవేదన వ్యక్తం చేశారు. నాపై ఐరన్ లెగ్ అని ముద్రవేశారు.. ప్రశ్నిస్తే మా క్యారక్టర్ మీదా దాడి చేస్తారా? అని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ.. తెలుగు దండుపాళ్యాం.. తెలుగు దుశ్శాసన పార్టీగా మారిందని దుయ్యబట్టారు. అందరినీ ఇలానే మాట్లాడుతారా..? టీడీపీని వీడినప్పటి నుంచి ఇలానే నన్ను వేధిస్తున్నారు? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను ఆట వస్తువుగా, ప్రచారానికి వాడుకున్నారు.. ఇప్పుడు ఇలాంటి వారని లోకేష్ ఎంకరేజ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి రేపు లోకేష్ భార్యకు కూడా వస్తుందన్న ఆమె.. బండారు వ్యాఖ్యలను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

టీడీపీలో మహిళలకు గౌరవం లేదు.. ఏ మహిళకైనా మనస్సు ఉంటుంది.. చేయని తప్పు శిక్ష వేస్తున్నారు అటూ కన్నీరు పెట్టుకున్నారు మంత్రి రోజా.. నేను చేసిన అభివృద్ధిపై నాతో చర్చకు రండి అంటూ సవాల్‌ చేశారు.. అరెస్ట్ చేశారని బండారు సత్యనారాయణను వదలను.. ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు మంత్రి ఆర్కే రోజా.