Leading News Portal in Telugu

Exam Pattern : AP లో కొత్త రూల్.. పరీక్షల విధానంలో మార్పులు..


AP Education: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల పరీక్షల విధానం లో మార్పులు చేర్పులు చేసింది. ఇప్పటి వరకు పరీక్షలు ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌ విధానంలో జరిగేవి. కానీ ఇక నుంచి కొత్త విధానంలో పరీక్షలు జరగనున్నాయి. వివరాలలోకి వెళ్తే.. ఇకపై 8వ తరగతి, 9వ తరగతి పరీక్షలు పీరియాడిక్‌, టర్మ్‌ విధానములో నిర్వహిణచనున్నట్లు AP ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విధానము కేవలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న 1000 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అవలంభించనున్నారు. 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు పీరియాడిక్‌ రాత పరీక్ష (పీడబ్ల్యూటీ)-2 నిర్వహించనున్నారు.
నాలుగు పీడబ్ల్యూటీలు పరీక్షలు రెండు టర్మ్‌ పరీక్షలు ఉంటాయి.

Read also:No Marriage: పెళ్లికి నో అంటున్న యువత.. కారణాలు ఇవేనా..

నవంబరులో టర్మ్‌-1 పరీక్షలను నిర్వహించగా టర్మ్‌-2 పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. టర్మ్‌ పరీక్షలో 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు అంతర్గత పరీక్షలుంటాయి. పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాత పరీక్ష, 10 మార్కులకు అంతర్గత పరీక్షలుంటాయి. కాగా విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు కచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. కాగా 10వ తరగతిలో 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. 3rd లాంగ్వేజ్‌ హిందీ ఉండదు. ఇంగ్లిష్‌ 1st లాంగ్వేజ్‌ కాగా సెకండ్‌ లాంగ్వేజ్‌గా తెలుగు ఉంటుంది. 6వ సబ్జెక్టుగా స్కిల్‌ సబ్జెక్టును అమలు చేయనుండగా 50 మార్కులు థియరీ.. 50 మార్కులు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. విద్యార్థులు ఈ మార్పులు గమనించుకోవాలి.