కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, నేడు( మంగళవారం ) మచిలీపట్నంలో జనసేన పార్టీ వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధ్వర్యంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ జనవాణి కార్యక్రమంలో పళ్యాణ్ కు ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. మచిలీపట్నం ముస్తాబాదకు చెందిన సెక్యూరిటీ గార్డు సతీష్ మరణంతో అనాధలైన కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని పవన్ కళ్యాణ్ అందించారు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా సతీష్ కుటుంబ సభ్యులు చెక్ అందుకున్నారు.
ఇక, వైసీపీ పార్టీ నుంచీ జనసేనలోకి చేరిన మేరుగు చినకోటయ్య.. జనసేన పార్టీలో చేరి పార్టీకి 5 లక్షల రూపాయల ఫండ్ నుఉయ్యూరుకు చెందిన మేరుగు చినకోటయ్య ఇచ్చారు. అయితే, నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జగన్ వేల కోట్ల అవినీతి గురించి ప్రధాని మోడీకి తెలుసని తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు. అందుకే తాను ఫిర్యాదు చేయలేదు అని చెప్పారు. అలాగే, ఈ పదేళ్లలో జనసేన పార్టీకి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి.. ప్రజాజీవితంలో కొన్ని విలువలను నిలబెట్టుకోవడానికే తాము పార్టీని నడుపుతున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అయితే, జనసేన పార్టీ మిత్రపక్షం బీజేపీ పేరును చెప్పకుండానే ఎన్నికల తర్వాత జనసేన, తెలుగుదేశం అధికారంలోకి వస్తామని పవన్ కళాణ్య్ తెలిపారు. అది తన దారికి వస్తే సంతోషంగా సీఎం పదవిని స్వీకరించడానికి రెడీగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ కేవలం 15 సీట్లకు మించి గెలుచుకోదని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు.