Leading News Portal in Telugu

KTR: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోతుంది.. మోడీకి కేటీఆర్ ఛాలెంజ్


KTR: ఇందూర్ ప్రజాగర్జన సభలో ప్రధాని మాట్లాడిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇందూరు సభలో ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. భారతీయ జనతా పార్టీ జూమ్లా పార్టీ అని.. బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ మోడీ అని కేటీఆర్ విమర్శించారు. మోడీ యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డు కూడా వస్తుందని తెలిపారు. తాము ఎన్డీఏలో చేరేందుకు తనతో మాట్లాడామన్నది అంతా అబద్ధం.. ఎన్డీఏ నుంచి ఒక్కొక్క పార్టీ వెళ్ళిపోతున్నాయని పేర్కొన్నారు. బీజేపీతో ఉన్నవి ఐటీ, ఈడీ, సీబీఐ అని ఎద్దేవా చేశారు.

మరోవైపు ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని.. ఈసారి అదే గతి పడుతుందని అన్నారు. మోడీ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బీజేపీకి వచ్చేది గుండు సున్నే అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే.. ఎన్డీఏలో చేరాల్సిన కర్మ బీఆర్ఎస్ కు లేదన్నారు. ఎన్డీఏలో చేరేందుకు మాకు ఏమి పిచ్చి కుక్క కరవలేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తాము కర్ణాటకలో డబ్బులు పంచితే మీ ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. మోడీతో చివరి దాకా నిలబడి తలబడతామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.