Leading News Portal in Telugu

PV Sindhu: ఆసియా గేమ్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పీవీ సింధు!


PV Sindhu sail into Asian Games 2023 Badminton quarters: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌ 2023 బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం ఉదయం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో సింధు 21–16, 21–16తో పుత్రి కుసుమ వర్దాని (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించింది. రెండు సెట్లలో వర్దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇక రజత పతకాన్ని ఖాయం చేసేందుకు తెలుగు తేజం సింధు మరో గెలుపు దూరంలో ఉంది.

మరోవైపు భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌ 21–16, 21–11తో లీ యున్‌ జియు (కొరియా)పై, హెచ్ఎస్ ప్రణయ్‌ 21–9, 21–12తో బత్‌దవా ముంఖ్‌బత్‌ (మంగోలియా)పై రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో గెలిచారు. ఇక మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో పుల్లెల గాయత్రి-ట్రెసా జాలీ జోడీ 21–14, 21–12తో నబీహా-ఫాతిమత్‌ (మాల్దీవులు) జంటపై గెలిచి.. ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.

స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో దీపిక పల్లికల్‌-హరీందర్‌ పాల్‌ సింగ్‌ జోడీ ఆసియా గేమ్స్‌ 2023 సెమీఫైనల్లోకి ప్రవేశించింది. దాంతో ఈ ఈవెంట్‌లో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయం అయింది. క్వార్టర్‌ ఫైనల్లో దీపిక-హరీందర్‌ 7–11, 11–5, 11–4 స్కోరుతో ఫిలిప్పీన్స్‌కు చెందిన అరిబాడో–ఆండ్రూ గారికా జంటపై విజయం సాధించారు.