Leading News Portal in Telugu

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. ఫైనల్స్‌కు చేరిన హాకీ జట్టు


Asian Games 2023: 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు.. సెమీ ఫైనల్ లోనే ఓటిమిని చవిచూడల్సి వచ్చింది. కానీ ఈసారి ఆసియా గేమ్స్ లో భారత పురుషుల జట్టు ఫైనల్ కు చేరుకుంది. సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 5-3తో ఓడించింది. దీంతో.. భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఐదో నిమిషంలో భారత జట్టు తొలి గోల్‌ చేసింది. అనంతరం 11వ నిమిషంలో మరో గోల్ చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు 2-0తో ముందుకు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌ 15వ నిమిషంలో భారత్‌ మూడో గోల్‌ చేయగా.. 17వ నిమిషంలో దక్షిణ కొరియా తొలి గోల్‌ చేసింది. ఆ తర్వాత 20వ నిమిషంలో దక్షిణ కొరియా రెండో గోల్‌ చేసింది. అయితే ఈ సమయంలో టీమిండియా 3-2తో ముందంజలో ఉంది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడి మంచి ప్రదర్శనను చూపించారు.

24వ నిమిషంలో భారత్‌కు నాలుగో గోల్‌ వచ్చింది. దీంతో భారత జట్టు 4-2తో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత దక్షిణ కొరియా మరోసారి ఎదురుదాడికి దిగింది. 42వ నిమిషంలో దక్షిణ కొరియా గోల్ చేసింది. దీంతో స్కోరు 4-3గా మారింది. భారత జట్టు ఆధిక్యం చెక్కుచెదరలేదు. అంతేకాకుండా.. 54వ నిమిషంలో భారత్‌ ఐదో గోల్‌ చేసింది. దీంతో మ్యాచ్‌లో భారత జట్టు 5-3తో ముందంజ వేసింది. చివర్లో టీమ్ ఇండియా దక్షిణ కొరియా ఆటగాళ్లకు గోల్స్ చేసే అవకాశం ఇవ్వకుండా.. మంచి ప్రదర్శన చూపించారు. దీంతో భారత జట్టు 5-3తో దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.