Leading News Portal in Telugu

World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ ప్రారంభోత్సవ వేడుకలు లేనట్టేనా.. కారణమేంటీ?


దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత్‌లో 2023 ప్రపంచకప్‌ జరుగుతోంది. ఈసారి ప్రపంచకప్ భారత్‌కు అత్యంత కీలకమని చెప్పాలి. స్వదేశంలో కప్ గెలవాలన్న ఆశ ఎవరికైనా ఉంటుంది. మరోవైపు ఎలాగైనా వరల్డ్ కప్ గెలవాలన్న కసితో భారత్ చూస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 10 అత్యంత బలమైన జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ మహాసంగ్రామం కోసం ఇప్పటికే క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్‌ రేపు (అక్టోబర్‌ 5న) ఇంగ్లండ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ మధ్య జరుగనుంది.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో బంగ్లాకు చుక్కలు చూపించిన మలేషియా క్రికెట్ జట్టు..

అయితే ఈ ప్రపంచకప్ ప్రారంభోత్సవానికి ముందు క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించడం లేదు. స్పోర్ట్స్ వెబ్‌సైట్ రెవ్ స్పోర్ట్స్ ప్రకారం.. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ బోర్డు(ICC) ఈసారి ఈ వేడుకను నిర్వహించడం లేదని తెలుస్తోంది. అయితే.. ఏదైనా పెద్ద టోర్నమెంట్‌ని ఇండియాలో నిర్వహించే ముందు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. అయితే ఈసారి మాత్రం క్రికెట్ అభిమానులకు ఆ ఎంజాయ్ మెంట్ ఉండదు. అయితే ఒకవేళ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించి ఉంటే.. పలువురు స్టార్లు ఈ వేడుకలో సందడి చేసే అవకాశం ఉండేది. కానీ ఈ వేడుక రద్దు అవడంతో.. ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.

Maharashtra: నాందేడ్ ఘటన మరవక ముందే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్కరోజులో 23 మంది మృతి

ఇదిలా ఉంటే.. కెప్టెన్స్ డే కోసం ప్రపంచ కప్ లో పాల్గొనే 10 మంది కెప్టెన్లు అహ్మదాబాద్‌కు రానున్నారు. ఇక రేపటి నుంచి ప్రపంచ కప్ ప్రారంభమవుతుండగా.. అక్టోబర్ 8న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 14 న అహ్మదాబాద్‌లో ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే ఓపెనింగ్ సెర్మనీ కాకుండా.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ఏమైనా గ్రాండ్ ఫంక్షన్‌ను నిర్వహించే ప్లాన్ చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. చూడాలి మరి వరల్డ్ కప్ గ్రాండ్ వేడుక ఎప్పుడు, ఎలా ఉంటుందో.