ప్రధాని మోడీ నిన్న నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. బీజేపీ నేతలను కుక్కలుగా అభివర్ణించారు. దీంతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందిస్తూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుకను మడత పెట్టి కుట్టేస్తామన్నారు డీకే అరుణ. పిచ్చిపట్టిన కుక్కల్లా మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ నేతల మాటలను ఖండిస్తున్నామన్నారు. 9లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ కేటాయించారని, అది మీకు కనిపించడం లేదా? అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్.. కల్వకుంట్ల చీటర్ రావు, కేటీఆర్- కంత్రి తారక్ రామ రావు అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.
అంతేకాకుండా.. ‘THR – తన్నీరు అర్యాష్ మెంట్ రావు. వీరంతా అడ్డగోలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిందే కల్వకుంట్ల కంత్రి కుటుంబం కోసం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పాస్ పోర్ట్ బ్రోకర్ కల్వకుంట్ల చీటర్ రావు. అబద్దం తప్ప నిజం చెప్పని కేసీఆర్ కుటుంబ సభ్యులు, వారి బంధువులు. వాస్తవాలను ప్రజల ముందుకు మోడీ తెచ్చారు. తెలంగాణ మోడల్ అంటే అవినీతి మోడల్ అంతకు మించి ఏమీలేదు. మోడీ మాటలు భరించలేక అక్కసు వెళ్లగక్కుతున్నారు. పిచ్చికుక్కల మిమ్మల్ని కరిచాయి.. అందుకే పిచ్చికుక్కల మోరుగుతున్నారు. కేసీఆర్ కు ఓట్లు వస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు దళిత బంధు, బీసీ బంధు త్వరగా పూర్తి చేయాలని స్వయాన మంత్రి ఎర్రబెల్లి చెబుతున్నారు.
లబ్ధిదారుల లిస్ట్ తీసుకోండి.. ఆ లోపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని మంత్రి చెప్పడంలో పథకాల అమలులో వారి చిత్తశుద్ధి ఎంటో అర్థమవుతుంది. తెలంగాణ మీ అబ్బ జాగీరా ? ప్రధానిగా ఎక్కడైనా వెళ్తారు. తెలంగాణ ప్రజలను BRS పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు. ఏ పార్టీలో ఉన్న పాలమూరు ప్రజల కోసం పనిచేశాం. పీసీసీ అధ్యక్షుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు… ఎందుకయ్యా క్షమాపణ చెప్పాలి స్పష్టత ఇవ్వాలి. పాలమూరు – రంగారెడ్డి డిజైన్లు మార్చి అడ్డగోలుగా లక్షల కోట్లు అంచనాలు పెంచారు. కేంద్రానికి ప్రాజెక్ట్ వివరాలు చెప్పకుండా.. ఇక్కడ వగల ఏడుపులు ఏడుస్తున్నారు. ఉన్న పథకాలను అమలు చేయలేకపోతున్న నేపథ్యంలో పోటీపడి పథకాలను అమలు చేస్తామని వాగ్దానాలు ఇస్తున్నారు.
ఒకరు మూడు వేల పించన్ అంటే మరొకరు నాలుగు వేలు అంటు ప్రజలను మోసం చేసేందుకు పోటీ పడుతున్నారు. ఓట్ల కోసం కేసీఆర్ భూములు అమ్మకానికి పెడుతున్నారు. కాంగ్రెస్ అరు గ్యారంటీల పేరుతో కర్ణాటక ప్రజలను మోసం చేశారు. కాంగ్రెస్ – BRS ఒక్కటే కాబట్టే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసును పక్కన పెట్టారు. BRS – కాంగ్రెస్ – MIM పార్టీలది ఫెవికాల్ బంధం మాది కాదు. రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తేనే గెలుస్తామని చెబుతున్నారు. నరేంద్రమోడీ పర్యటన తో ప్రత్యర్థి పార్టీల నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. లోపాయికారి ఒప్పందం తోనే BRS కాంగ్రెస్ పనిచేస్తున్నాయి.’ అని డీకే అరుణ ఫైర్ అయ్యారు.