Leading News Portal in Telugu

Tollywood: సీక్వెల్స్ అమ్మా.. సీక్వెల్స్.. సినిమా ఏదైనా.. పార్ట్ 2 పక్కా


Tollywood: టాలీవుడ్ లో ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఆ సినిమాకు సీక్వెల్ ప్రకటించి.. మొదటి కథకు.. ఈ కథకు సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్ కథ మొదలుపెట్టింది రాజమౌళి. బాహుబలి సినిమా మొత్తం ఒక సినిమాలో పట్టదని, కథను, క్యారెక్టర్స్ ను జస్టిఫై చేయలేమని ఆ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. చెప్పినట్లే బాహుబలి లో కొడుకు కథను.. బాహుబలి 2 లో తండ్రి కథను చూపించి అభిమానుల మనసులను గెలిచాడు. ఇక అప్పుడు మొదలైన సీక్వెల్.. ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. కథను.. ప్రేక్షకులు అర్ధం చేసుకొనేలా సినిమాగా తీయడం వరకు ఓకే. అయితే ఆ కథను ఇంకా పొడిగించి, సాగదీసి, కొత్త కొత్త క్యారెక్టర్స్ ను తీసుకొచ్చి.. రెండు భాగాలు అని చెప్పేస్తున్నారు. సినిమా చివరిలో దానికి కొనసాగింపు ఉంటుందని హింట్ ఇచ్చి.. సీక్వెల్ పై అంచనాలను పెంచేస్తున్నారు.

Singer Mangli: బావతో ఏడడుగులు.. పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన మంగ్లీ

ఇక టాలీవుడ్ లో సీక్వెల్స్ అంతగా అచ్చిరాలేదని చెప్పాలి. హిట్ అయిన సినిమాకు సీక్వెల్ గా వచ్చిన చాలా సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. బాహుబలి, కార్తికేయ, హిట్, కెజిఎఫ్ లాంటి సినిమాలకు కొనసాగింపుగా వచ్చిన సినిమాలు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ అంతా సీక్వెల్స్ మయంగా మారిపోయింది. ఒకటి కాదు.. రెండు కాదు దాదాపు ఓ పది సినిమాల వరకు సీక్వెల్స్ ప్రకటించాయి. అందులో చూసుకుంటే.. పుష్ప, సలార్, దేవర, కల్కి, హిట్, గూఢచారి, స్కంద, పెదకాపు, అఖండ, ఇస్మార్ట్ శంకర్, మా ఊరి పొలిమేర,.. ఇలా సీక్వెల్స్ క్యూ కట్టాయి. ఇందులో దాదాపు అన్ని సినిమాలు పార్ట్ 1 సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయే. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక పెద్ద సినిమాలే సీక్వెల్స్ ప్రకటిస్తే.. మేము ఏమైనా తక్కువా అని చిన్న సినిమాలు కూడా పాన్ ఇండియా అని, పార్ట్ 2 అని చెప్పుకొస్తున్నాయి. మరి ఈ సినిమాల్లో ఏ సీక్వెల్ హిట్స్ ను అందుకుంటాయో చూడాలంటే.. ఇంకొంతకాలం వేచి ఉండక తప్పదు.