Leading News Portal in Telugu

Asian Games 2023: ఆసియా క్రీడల్లో బంగ్లాకు చుక్కలు చూపించిన మలేషియా క్రికెట్ జట్టు..


చిన్న టీమే కదా అని అంచనా వేస్తే.. సునామీ సృష్టించారు. ఆసియా క్రీడల్లో బంగ్లాతో జరిగిన క్వార్టర్ ఫైనల్-4లో పసికూన మలేషియా.. బంగ్లాదేశ్ ను ఓడించినంత పని చేశారు. ఒకానొక సమయంలో ఈ మ్యాచ్ మలేషియా గెలుస్తుందని అనుకున్నప్పటికీ.. అఫీఫ్‌ హొస్సేన్‌ ఆల్‌రౌండ్‌ షో చేశాడు. బ్యాటింగ్ లో14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులతో చెలరేగగా.. బౌలింగ్ లో 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్ ను ఆదుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. మరోవైపు అక్టోబర్‌ 6న జరిగే తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ టీమిండియాతో తలపడనుంది.

Maharashtra: నాందేడ్ ఘటన మరవక ముందే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్కరోజులో 23 మంది మృతి

బంగ్లా, మలేషియా మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేసింది. మలేషియా అద్భుత బౌలింగ్ తో బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశారు. బౌలర్లు పవన్‌దీప్‌ సింగ్‌ (4-1-12-2), విరన్‌దీప్‌ సింగ్‌ (4-0-13-0)తో మంచి ప్రదర్శన చూపించారు. ఇక.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ సైఫ్‌ హస్సన్‌ (50 నాటౌట్‌), అఫీఫ్‌ హొస్సేన్‌ (23), షాదత్‌ హొస్సేన్‌ (21) పరుగులు చేశారు.

Nobel Prize 2023: రసాయన శాస్త్రంలో నోబెల్‌ ప్రైజ్‌ పొందిన శాస్త్రవేత్తలు వీరే..

ఆ తర్వాత 117 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో బరిలోకి దిగిన మలేషియా జట్టు.. 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో మలేషియా కష్టాల బాటలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన విరన్‌దీప్‌ సింగ్‌ (39 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చేశాడు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి మలేషియాను గెలిపించినంత పని చేశాడు. అయితే ఆఖరి ఓవర్లో అఫీఫ్‌ హొస్సేన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి.. మలేషియా గెలుపుకు కావాల్సిన 5 పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశాడు. ఆఖరి ఓవర్ లో కేవలం 2 పరుగులు ఇచ్చిన అఫీఫ్ హొస్సేన్.. విరన్‌దీప సింగ్‌ వికెట్ తీశాడు. దీంతో బంగ్లాదేశ్‌ 2 పరుగుల తేడాతో గెలుపొందింది.