Leading News Portal in Telugu

BREAKING NEWS: శిఖర్ ధావన్కు విడాకులు మంజూరు..


టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి విడాకులు మంజూరయ్యాయి. కొంతకాలం క్రితం శిఖర్ ధావన్.. తన భార్య అయేషా ముఖర్జీ మానసికంగా హింసించిందని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు శిఖర్ ధావన్ వాదనలను సమర్ధించింది. ఇదిలా ఉంటే.. శిఖర్ ధావన్ కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉంటే, పర్సనల్ జీవితంలోనూ ఏమాత్రం సంతోషంగా లేడు. తన కుమారుడితో కొన్నాళ్ల పాటు విడిగా ఉండాలని తన భార్య ఒత్తిడి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యారని కోర్టు అభిప్రాయపడింది.

CM YS Jagan Delhi Tour: సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ.. అదే ప్రధాన కారణం..!

ఇదిలా ఉంటే.. ధావన్, ఆయేషా దంపతుల కుమారుడిని శాశ్వత కస్టడీకి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. మరోవైపు ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడిని కలిసేందు ధావన్ కు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో అకడమిక్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని.. పాఠశాల సెలవుల్లో ధావన్, అతని కుటుంబ సభ్యులను కలిసేందుకు ధావన్ కొడుకును ఇండియాకు తీసుకురావాలని ఆయేషాకు కోర్టు తెలిపింది.

Guess Who: అక్కడ టాటూ చూపించి టెంప్ట్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో చెప్పండి..?

ఇక శిఖర్ ధావన్ కెరీర్ గురించి చూసుకుంటే.. ఒకప్పుడు టీమిండియాలో స్టార్ ప్లేయర్ కాగా.. ప్రస్తుతం ఫామ్ లో లేక జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. శిఖర్ ధావన్ ఓపెనర్ గా రానిస్తున్నప్పటికీ.. ఇప్పుడు జట్టులో చోటు కోసం ఉన్న పోటీని తట్టుకోలేక వెనుకబడి ఉన్నాడు. అయినప్పటికీ దేశవాళీ టోర్నీల్లో ఆడి నిలకడగా పరుగులు సాధిస్తే మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించవచ్చు.