Leading News Portal in Telugu

Rajasthan Voter List: రాజస్థాన్‌లో 5.26 కోట్ల మంది ఓటర్లు.. కొత్తగా చేరిన 6.96 లక్షల మందిపై నాయకుల కన్ను


Rajasthan Voter List: రాజస్థాన్‌లో ఈ ఏడాది నవంబర్‌-డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఎన్నికల కోసం కమిషన్ అన్ని రాజకీయ పార్టీలు, పరిపాలన అధికారులు, ఇతర వ్యక్తులతో సమావేశాలు నిర్వహించింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పలు అంశాలపై చర్చించారు. ఇప్పుడు కమిషన్ ఎన్నికల తేదీలను ఎప్పుడైనా ప్రకటించవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం తేదీలను ఎప్పుడు ప్రకటిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతలో ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను మిషన్ బుధవారం విడుదల చేసింది.

2.73 కోట్లకు పైగా పురుష ఓటర్లు
రాష్ట్ర ఎన్నికల విభాగం బుధవారం డేటాను విడుదల చేస్తూ, రాజస్థాన్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 5.26 కోట్లకు చేరుకుంది. అందులో 2.51 కోట్ల మంది మహిళలున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలో 6.96 లక్షలకు పైగా కొత్త ఓటర్లు చేరారు. ఓటరు జాబితా తుది ప్రచురణ తేదీ నాటికి రాష్ట్రంలో 5.26 కోట్లకు పైగా ఓటర్లు నమోదయ్యారు. వీరిలో 2.73 కోట్ల మందికి పైగా పురుషులు.

17 వేలకు పైగా ఓటర్లు 100 ఏళ్లు పైబడిన వారు
ఈ సవరణ కార్యక్రమం కింద గత ప్రచురించిన ఓటరు జాబితాలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 11.78 లక్షల మంది, 100 ఏళ్లు పైబడిన 17,241 మంది ఓటర్లు నమోదయ్యారని ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపారు.

ప్రత్యేక ఓటర్ల సంఖ్య 5.61 లక్షలు
అదేవిధంగా ప్రత్యేకంగా అర్హులైన మొత్తం 5.61 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఓటరు జాబితాలో నమోదైన ఈ ఓటర్లకు ఎన్నికల సమయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించింది. త్వరలో ఎన్నికల తేదీని ప్రకటిస్తామని ఇటీవల కూడా ఎన్నికల సంఘం విలేకరుల సమావేశంలో తెలిపిన సంగతి తెలిసిందే.