X’s Ad Revenue: తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని అన్నట్లు ఉంది ఎలోన్ మస్క్ పరిస్థితి . ఎన్నో భారీ అంచనాలతో కొత్తకొత్త ఆలోచనలతో ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ కి నిరాశే మిగిలింది. వివరాలలోకి వెళ్తే.. బిలియనీర్ ఎలోన్ మస్క్ 2022 అక్టోబర్ లో ట్విట్టర్ ని కొనుగోలు చేసారు. అనంతరం ట్విట్టర్ పేరు ని కాస్త X గా మార్చారు. అయితే X మొదటి నుండి నష్టాల బాటలోనే రానిస్తుంది. రాయిటర్స్‌కు అందించిన థర్డ్-పార్టీ డేటా ప్రకారం.. ఎలాన్ మస్క్ స్ కొనుగోలు చేసినప్పటి నుండి Xలో నెలవారీ US ప్రకటన ఆదాయం ప్రతి నెలా కనీసం 55% తగ్గింది. కొంతమంది ప్రకటనదారులను నిలుపుకోవడంలో కంపెనీ చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రణాళికలు తెలిసిన వ్యక్తి సమాచారం ప్రకారం.. X యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్, Linda Yaccarino, కంపెనీ వ్యాపార ప్రణాళికలను వివరించడానికి మస్క్ కొనుగోలుకు ఆర్థిక సహాయం చేసిన బ్యాంక్ రుణదాతలతో గురువారం సమావేశం కానున్నారు.
Read also:Rishi Sunak’s controversial speech: వివాదంగా మారిన బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యలు.. ఇది లింగ వివక్షే..!
అందుబాటులో ఉన్న తాజా డేటా ప్రకారం ఆగస్ట్‌లో ప్రకటన రాబడి 60% తగ్గింది. X డేటాపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. సోషల్ మీడియా వేదిక ఆదాయాన్ని నష్టాల బాటలో నడిపిందని మస్క్ గతంలో అంగీకరించాడు. అలానే యాడ్ ఏజెన్సీలపై ఒత్తిడి తెచ్చారంటూ కార్యకర్తలను నిందించాడు. యాంటీ-డిఫమేషన్ లీగ్ కారణంగానే గతనెలలో U.S. ప్రకటన ఆదాయంలో 60% నష్టం వచ్చిందని తెలిపారు. కాగా ADL X కి నష్టం వచ్చిందనే ఆరోపణ తప్పు అని పేర్కొంది. ఈ నేపథ్యంలో “X మరియు దాని వినియోగదారులకు వ్యతిరేకంగా వస్తున్న తప్పుడు వదంతులను ఖండించేందుకు, ప్లాట్‌ఫారమ్‌లో ప్రకటనలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది సంస్థ.