Leading News Portal in Telugu

Hi Nanna: ప్రోమో సాంగ్ లోనే చాలా మ్యాజిక్ ఉంది…


న్యాచురల్ స్టార్ నాని,  మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ‘హాయ్ నాన్న’. కొత్త దర్శకుడు శౌరవ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ కానుంది. డిసెంబర్ నుంచి జనవరికి షిఫ్ట్ అవుతుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ మేకర్స్ నుంచి మాత్రం అలాంటి హింట్స్ కనిపించట్లేదు. డిసెంబర్ లోనే రిలీజ్ అనేలా హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ ని చేస్తున్నారు. ఇప్పటికే గ్లిమ్ప్స్ తో ఇంప్రెస్ చేసిన హాయ్ నాన్న టీమ్… సమయమా సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసారు. టాప్ ట్రెండ్ అయిన సమయమా సాంగ్ హాయ్ నాన్న సినిమాకి సూపర్బ్ బజ్ జనరేట్ చేసింది.

ఈ సాంగ్ విన్న వాళ్లందరూ హాయ్ నాన్న సినిమా లవ్ స్టోరీ ఏమో అనుకున్నారు… కాదు ఇది తండ్రి కూతురి ప్రేమకథని కూడా చూపిస్తుంది అంటూ సెకండ్ సాంగ్ బయటకి రాబోతుంది. “నా గాజు బొమ్మ, నేను అట అమ్మా… ఎద నీళ్లు ఉయ్యాల కొమ్మా… నిన్ను ఊపే చెయ్యే ప్రేమా…” అంటూ అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ ని అంతే గొప్పగా పాడాడు మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహబ్. ప్రోమో సాంగ్ లోనే ఇంత మ్యాజిక్ ఉంటే ఫుల్ సాంగ్ ఎంత బ్యూటిఫుల్ గా, సూతింగ్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. రేపు ఉదయం 11 గంటలకి “గాజు బొమ్మ” ఫుల్ లిరికల్ సాంగ్ బయటకి వస్తుంది, ఈలోపు ప్రోమోలోని మ్యాజిక్ కి మెస్మరైజ్ అవ్వండి.