ఏపీ హైకోర్టులో బుద్ధా వెంకన్నకు ఊరట | big relief to budda venkanna| ap| hicourt| quash| pitition| 41a
posted on Oct 5, 2023 5:27PM
తెలుగుదేశం నాయకుడు బుద్ధా వెంకన్నకు ఏపీ హై కోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ బుద్ధ వెంకన్న ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇటీవల గన్నవరంలో జరిగిన సభలో ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై బుద్దా వెంకన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే పేర్ని నాని ఫిర్యాదు మేరకు బుద్ధా వెంకన్నపై అత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో బుద్దా వెంకన్న హైకోర్టును ఆశ్రయించారు. బుద్ధా వెంకన్న క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు వెంకన్నను అరెస్టు చేయకుండా 41ఏ నోటీసు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.