Leading News Portal in Telugu

The Vaccine War: “ది వాక్సిన్ వార్” సినిమాపై ప్రధాని మోడీ ప్రశంసలు..


The Vaccine War: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీ మేకర్స్ నుంచి వచ్చి మరో సినిమా ‘ది వాక్సిన్ వార్’. కోవిడ్ సమయంలో భారత శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ రూపొందించిన కథాంశంతో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తీశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో శాస్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు, వారి కృషిని ఆధారంగా ఈ సినిమాను రూపొందింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

తాజాగా ది వ్యాక్సిన్ వార్ సినిమాపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు.ఆయన చేసిన ప్రసంగంలో వ్యాక్సిన్ వార్ సినిమాను గురించి ప్రస్తావించారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా భారత శాస్త్రవేత్తల కృషిని ప్రధాని అభినందించారు. మన దేశ శాస్త్రవేత్తలు రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడిన తీరు వివరిస్తూ ‘ది వ్యాక్సిన్ వార్’ అనే సినిమా తీసినట్లు విన్నానని, బుషుల వలే శాస్త్రవేత్తలు ల్యాబుల్లో కోవిడ్‌తో పోరాడారని, శాస్త్రవేత్తలు, సైన్స్ ప్రాముఖ్యతను హైలెట్ చేసినందుకు ఈ చిత్ర నిర్మాతలను అభినందిస్తున్నానని మోడీ అన్నారు.

శాస్త్రవేత్తల అచంచలమైన అంకితభావం, త్యాగాలను ఈ సినిమా అద్భుతంగా చిత్రీకరించిందని, కష్ట సమయాల్లో శాస్త్రీయ పరిశోధన ప్రాముఖ్యతను గురించి చర్చను రేకెత్తించిందని కొనియాడారు. నానా పటేకర్, సప్తమి గౌడ, రైమా సేన్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి లీడ్ క్యారెక్టర్లుగా వివేక్ అగ్రిహోత్రి దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించారు. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 28న విడుదలైంది.