వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభ పోటీలో న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి వికెట్ కు 44 పరుగులు భాగస్వామ్యం చేసిన తర్వాత వికెట్ పడటంతో క్రీజులోకి జో రూట్ (77) వచ్చి నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తర్వాత గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ 43, జానీ బెయిర్‌స్టో 33, డేవిడ్ మలన్ 14, హ్యారీ బ్రూక్ 25, మొయిన్ అలీ 11, లియామ్ లివింగ్ స్టోన్ (20), క్రిస్ వోక్స్ (11), సామ్ కరన్ 14 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
అయితే, ఇంగ్లాండ్ టెయిలెండర్లు ఆఖర్లో తలో చేయి వేసి ఓ మోస్తరు పరుగులు చేయడంతో ఊహించిన దాని కంటే ఎక్కువ పరుగులు చేసింది. 252 పరుగుల దగ్గర తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లీష్ జట్టు టెయిలెండర్లు మరో 30 పరుగులు జోడించడంతో 282 రన్స్ దగ్గర ఇన్నింగ్స్‌ను ముగిసింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 రన్స్ చేసింది.
అయితే, ఈ మ్యాచ్ కు గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు వీలుగా న్యూజిలాండ్ సారథి కేన్ విలియంసన్‌కి విశ్రాంతి ఇచ్చారు. న్యూజిలాండ్ బ్యాటర్లు అందరూ డబుల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంలో కివీస్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లు టిమ్ సౌథీ, లూకీ ఫర్గూసన్ గాయాలతో నేటి మ్యాచ్‌కి దూరంగా ఉన్నారు. మ్యాట్ హెన్రీకి 3 వికెట్లు దక్కాయి.. మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ 2 వికెట్లు తీసుకోగా.. రాచీ రవీంద్ర, ట్రెంట్ బోల్డ్ లు తలో వికెట్ తీసుకున్నారు.