ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రెండు రోజులపాటు దేశ రాజధానిలో సీఎం పర్యటించనున్నారు. కాగా, ఇవాళ సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించారు. పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని ఆయన వినతి చేశారు. ఇక, సీఎం జగన్ సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డిలు ఉన్నారు.
అలాగే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను సీఎం జగన్ కలిశారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై ప్రధానంగా ఆయన చర్చించారు. రేపు (శుక్రవారం) ఉదయం విజ్ఞాన్ భవన్‌లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరిగే సదస్సులో సీఎం పాల్గొననున్నారు. రేపు రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.