Leading News Portal in Telugu

BL Santosh : ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదు.. ఉండే వారు ఉంటారు.. పోయే వారు పోతారు


తెలంగా బీజేపీ రాష్ట్ర పధాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదని, ఉండే వారు ఉంటారు.. పోయే వారు పోతారని వ్యాఖ్యానించారు. గత ముప్పై ఏళ్లుగా పార్టీ ఎలా పోతుందో.. ఇప్పుడు అలాగే నడుస్తుందని, ఇతర రాష్ట్రంలో ఇదే సంస్థాగత విధానం తో అధికారంలోకి వచ్చామన్నారు. ఇక్కడ అధికారం లోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోడీ – కేసీఆర్ కలిసి ఉంటే ఈ కార్యక్రమాలు ఎందుకు..? అని ఆయన ప్రశ్నించారు. ఈ పనులు ఎందుకని, అనవసరపు మాటలు తగ్గించండి.. తప్పుడు ప్రచారాలు నమ్మకండన్నారు బీఎల్‌ సంతోష్‌.

అనంతరం బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీ ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ.. మోడీ మన ట్రంప్ కార్డ్ అని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతరేకత విపరీతంగా ఉందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత లేదని, వ్యతిరేక ఓటు బీజేపీ కి అనుకూలంగా మారుతుందన్నారు ప్రకాష్ జవదేకర్. అంతేకాకుండా.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. ఆతరువాతం జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ మాట్లాడుతూ.. ఎన్నికల వరకు 18 కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 20లోపు ఆరు కార్యక్రమాలు పూర్తి చేయాలని సునీల్ బన్సల్ అన్నారు. ఓటర్ వెరిఫికేషన్, మేరీ మాటి మేరీ దేశ్, యువ, మహిళ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ ల సమ్మేళనాలు మేధావుల సమ్మేళనాలు నిర్వహించారు.