Leading News Portal in Telugu

Tiger NageswaraRao: టైగర్ ప్రమోషన్స్.. నేషనల్ అవార్డు సినిమా డైరెక్టర్ తో..?


Tiger NageswaraRao: మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తోంది
ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అక్టోబర్ 20 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన రవితేజ.. వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి.. ఒక డైరెక్టర్ తో ఇంటర్వ్యూ చేయించడం ఫ్యాషన్ గా మారిపోయింది.

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో శోభా శెట్టి వారానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా..?

ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్ లో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ను డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేశాడు. ఆచార్యకు హరీష్ శంకర్ ఇంటర్వ్యూ చేశాడు. ఇక రవితేజ రావణాసురకు ఆయన డైరెక్టర్లు కలిసి రవితేజను ఇంటర్వ్యూ చేశారు. ఇక అలాగే ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు టీమ్ కూడా ఒక కుర్ర డైరెక్టర్ తో ఇంటర్వ్యూకు రెడీ అయ్యింది. కలర్ ఫోటో సినిమాతో డైరెక్టర్ గా మారాడు సందీప్ రాజ్. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం ఒక కొత్త ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సందీప్.. టైగర్ ప్రమోషన్స్ లో తనవంతు సాయం చేశాడు. రవితేజ, వంశీని ఇంటర్వ్యూ చేస్తూ కనిపించాడు. ఈ ఇంటర్వ్యూ ఈరోజే షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మరి రెండు రోజుల్లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ ఇంటర్వ్యూలో రవితేజ ఎలాంటి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటాడో చూడాలి.