Leading News Portal in Telugu

Group-4 Final Key: గ్రూప్-4 ఫైనల్ కీ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 ఫైనల్ కీని విడుదల చేసింది. గ్రూప్-4 తుది కీని టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. గ్రూప్-4 పరీక్షలో పేపర్ 1లో 7 ప్రశ్నలను అధికారులు తొలగించారు. మరో 8 ప్రశ్నలకు ఆప్షన్‌ మార్చారు.. అలాగే పేపర్‌-2లో 2 ప్రశ్నలను తొలగించారు.. మరో 5 ప్రశ్నలకు ఆప్షన్స్ మార్చినట్లు తెలిపారు. త్వరలో గ్రూప్-4 పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేయనుంది. ఈ ఏడాది జులై1న గ్రూప్ 4 పరీక్ష జరిగింది. ఆగస్టు 28న గ్రూప్‌-4 ప్రైమరీ ‘కీ’ రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యంతరాలను తెలుసుకుంది. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత.. నేడు ఫైనల్ కీ రిలీజ్ చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీతో వెరిఫై చేయించి తాజాగా టీఎస్పీఎస్సీ ఫైనల్ కీని విడుదల చేశారు. తెలంగాణలో గ్రూప్‌-4 సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి సంబంధించి రాత పరీక్ష (పేపర్‌-1, పేపర్‌-2) జులై 1న నిర్వహించింది.