Leading News Portal in Telugu

Bl Santhosh: తెలంగాణలో హంగ్‌ వస్తుంది.. ఎట్టి పరిస్థితుల్లో అధికారం మనదే..


తెలంగాణ రాష్ట్రంలో హంగ్‌ వస్తుందంటూ బీజేపీ సీనియర్‌ నేత బీఎల్‌ సంతోష్‌ కామెంట్స్ చేశారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టికెట్లు హైదరాబాద్‌, ఢిల్లీలో ఇవ్వరు.. అనవసరంగా నేతల చుట్టూ తిరగొద్దు అని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ప్రజల్లో ఉండాలి అని బీఎల్ సంతోష్ తెలిపారు. నేతలు వివేకంతో ఆలోచించాలంటూ ఆయన హితవు పలికారు. కాగా, నిన్న (గురువారం) జరిగిన బీజేపీ రాష్ట్ర పధాధికారుల సమావేశంలో కూడా బీఎల్‌ సంతోష్‌ హాట్ కామెంట్స్ చేశారు. ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదు.. 30 ఏళ్లుగా ఎలా ఉందో అలానే పార్టీ ఇప్పుడు కూడా నడుస్తుందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇదే విధానంతో అధికారంలోకి వచ్చామని బీఎల్ సంతోష్‌ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఉన్న నేపథ్యంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలో ఒకవేళ బీఎల్ సంతోష్ చెప్పినట్లు హంగ్ ఏర్పడితే.. బీఆర్ఎస్-బీజేపీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాయకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే, సీట్ల కేటాయింపు ఢిల్లీలో ఉండదు.. తెలంగాణలోనే జరుగుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో హంగ్ ఏర్పడి బీజేపీ అధికారంలోకి వస్తుందని కాషాయ శ్రేణులకు బీఎల్ సంతోష్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత బీజేపీ, బీఆర్ఎస్‌లు కలుస్తాయా అనే అనుమానం వస్తుంది.