Leading News Portal in Telugu

Prabhas: ప్రభాస్ భార్య పిల్లలను చూసారా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోస్


Prabhas: ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒకే ఒక్క యాప్ ఏఐ. ఏ ముహూర్తనా ఈ టెక్నాలజీ వచ్చిందో గానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో అభిమానులకి ఇదే పనిగా మారిపోయింది. తమ అభిమాన హీరోలను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. నిజం చెప్పాలంటే ఆ ఫోటోలు చూస్తే హీరో ఒరిజినల్ ఫేస్ ను కూడా మర్చిపోయేలాగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఇలా ఒక్కరిని కూడా వదలకుండా తమ అభిమాన హీరో ఎవరైనా సరే వారి ఫోటోలను ఏఐ టెక్నాలజీతో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక ఇక్కడి వరకు ఓకే గానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకువేసి ఏఐ లోనే ప్రభాస్ కు పెళ్లి చేసి, పిల్లల్ని కూడా పుట్టించారు.

Radhika Sarathkumar: మగాడిగా ఉండు.. లేకపోతే పిరికిపందలా బతుకు.. రోజాకు సపోర్ట్ గా రాధిక

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున ప్రభాస్ అని చెప్పేస్తారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కుతాడు అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రభాస్ తన పెళ్లి విషయం చెప్పకపోయేసరికి అభిమానూలు .. తమ ఆనందం కోసం ప్రభాస్ పెళ్లి జరిగినట్లు.. ప్రభాస్ కుటుంబం ఇది అంటూ ఏఐ టెక్నాలజీ ద్వారా ఎడిట్ చేసి షేర్ చేశారు. ఇక ఇందులో ప్రభాస్ కు అనుష్కకు పెళ్లి అయ్యి.. ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఫోటోలు ఎడిట్ చేశారు. ఎప్పటినుంచో ప్రభాస్ అనుష్క మధ్య ప్రేమాయణం నడుస్తుందని, వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని, తామిద్దరం మంచి స్నేహితులమని ప్రభాస్, అనుష్క ఇప్పటికీ చెప్తూనే వస్తున్నారు. అయితే వారిద్దరి ఫెయిర్ బాగుండడంతో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక పెళ్లిపై వారు స్పందించకపోయేసరికి అభిమానులు తమ ప్రేమను ఈ విధంగా చూపించారు. ప్రభాస్, అనుష్క మధ్య స్నేహం పక్కనపెడితే ఈ ఫోటోలో ప్రభాస్, అనుష్క జంట ఎంతో అద్భుతంగా ఉంది. నిజంగా ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటే ఒరిజినల్ ఫోటోలు కన్నా ఈ ఫోటోలే ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రభాస్.. భార్య పిల్లలు అంటూ నెటిజన్స్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ వైరల్ గా మారాయి.