Leading News Portal in Telugu

Jagananna Arogya Suraksha: జగనన్న ఆరోగ్య సురక్ష.. ఊరూ వాడా అపూర్వ స్పందన


Jagananna Arogya Suraksha: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం విజ­యవంతంగా సాగుతోంది.. జగనన్న ఆరోగ్య సురక్ష ఈ నెల 5వ తేదీ (శుక్రవారం) వరకు సాగిన కార్యక్రమ వివరాలను పరిశీలిస్తే అపూర్వంగా సాగుతోంది.. అక్టోబర్ 5వ తేదీ నాటికి నిర్వహించిన మొత్తం శిబిరాలు 2,429గా పేర్కొంది ప్రభుత్వం.. ఇక, శిబిరాలకు హాజరైన మొత్తం ప్రజల సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంది.. ఉచితంగా వైద్యులను సంప్రదించగలిగే పౌరులు లక్ష 9.9 లక్షలకు పైగా ఉందని సర్కార్‌ తెలిపింది.. మరోవైపు.. ఇంటి వద్దేకే వెళ్లి 3.82 కోట్లకు పైగా రాపిడ్ పరీక్షలు నిర్వహించారు.. ఇప్పటి వరకు ఆరోగ్య పరీక్షలు పూర్తయిన పౌరుల సంఖ్య 2.33 కోట్లకు పైగా ఉంది.. మొత్తంగా డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శాఖ షెడ్యూల్‌ ప్రకారం వైద్య శిబిరాలను జోరుగా నిర్వహిస్తోంది. శిబిరాల్లో ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పె­షలిస్ట్‌ వైద్యుల సేవలను పొందుతున్నారు. డాక్టర్లు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ జరుగుతోంది.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ 30 నుంచి ప్రారంభించిన విషయం విదితమే.

ఇక, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని ఏఎన్‌ఎం, సీహెచ్‌వోలు సందర్శించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.. ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి వైద్య శిబిరాలకు హాజరు కావాలని కోరుతూ టోకెన్లు జారీ చేస్తుండగా.. కొన్ని సందర్భార్లో టోకెన్లు లేకున్నా కూడా ఆయా ప్రాంతాల్లో నిర్వహిస్తోన్న వైద్య శిబిరానికి రావొచ్చు.. వైద్య సేవలు పొందవచ్చు అని అధికారులు చెబుతున్నారు.. మరోవైపు.. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో మహిళలకు ప్రత్యేక కౌంటర్లు కూడా కొన్ని ప్రాంతాల్లో రద్దీని బట్టి ఏర్పాటు చేస్తున్నారు.. ఆరోగ్య సురక్ష శిబిరంలో వైద్య సేవలు పొందాం.. బయట చూయించుకుంటే బోలెడంత ఖర్చు అయ్యేది.. ఇక్కడే మందులతో సహా ఇస్తున్నారంటూ శిబిరాలను సందర్శించిన ప్రజలు చెబుతున్నారు.