Leading News Portal in Telugu

Radhika Sarathkumar: మగాడిగా ఉండు.. లేకపోతే పిరికిపందలా బతుకు.. రోజాకు సపోర్ట్ గా రాధిక


Radhika Sarathkumar: ఏపీ మంత్రి ఆర్కే రోజాపై మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు రోజురోజుకు దుమారం రేపుతున్నాయి. “రోజా నీ బతుకు ఎవడికి తెలియదు. బ్లూ ఫిల్మ్‌లో యాక్ట్ చేసిన దానివి. అవి మా దగ్గరున్నాయి. బయటపెట్టకూడదని, ఎప్పుడూ రిలీజ్ చేయలేదు. నీ బతుకు విప్పమంటావా? రికార్డింగ్ డ్యాన్సులు, కిరాయికి డ్యాన్సులు వేసే నువ్వు.. అదృష్టం బాగుండి మంత్రి అయిపోతే.. ఇప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడతావా” అంటూ బండారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. ఇక ఈ వ్యాఖ్యలపై రోజా ఎమోషనల్ అయిన విషయం కూడా అవిదితమే.. ఒక మంత్రిని పట్టుకొని అలా ఎలా మాట్లాడగలరు అని ప్రతి ఒక్కరు బండారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఒక మహిళను ఇంత దారుణంగా అవమానించడం పద్దతి కాదని, అది రాజకీయం అస్సలు కాదని మహిళామణులు సైతం రోజాకు మద్దతు తెలుపుతున్నారు. ఇక నిన్నటి నుంచి నటీమణులు కూడా రోజాకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే నటి ఖుష్బూ.. రోజాకు మద్దతు తెలుపుతూ.. బండారుకు వార్నింగ్ ఇచ్చిన తెల్సిందే.

Ashu Reddy : ఏంటి పాప.. మొత్తం చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోతారు..

ఇక తాజాగా మరో నటి రాధికా శరత్ కుమార్.. బండారు సత్యనారాయణమూర్తిపై ఫైర్ అయ్యింది. సిగ్గుండాలి మీకు.. ఒక మహిళను అలా మాట్లాడానికి.. మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తుంది అంటూ వీడియోలో విరుచుకుపడింది. ” మంత్రి, నటి, నా ఫ్రెండ్ అయిన రోజా గారు.. నేను మీకు సపోర్ట్ గా ఉన్నాను. నేను రెండు రోజుల క్రితం ఆమెపై జరిగిన లో పాలిటిక్స్ చూసాను. ఈరోజు నాకు చాలా బాధగా ఉంది.. చాలా హార్ట్ చేసాయి.. అంతేకాకుండా నాకు కోపం తెప్పించాయి. పార్లమెంట్.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చింది. ఈరోజు మహిళలు రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు. ఇలా మీరు దిగజార్చే మాటలు అంటున్నారు. ఇదేనా ఒక మహిళను మీరు హ్యాండిల్ చేసేది.. ? ఇలానేనా ఒక మహిళకు గౌరవం ఇచ్చేది..?. మీకు అటెన్షన్ రావడం కోసంఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తారా.. ?.. మిమ్మల్నిచూస్తుంటే సిగ్గేస్తుంది. ఒక పిరికివాడు మాట్లాడే మాటలు.. ఇలాంటి లాంగ్వేజ్.. ఒక ఆడదాన్ని ఏదైనా చెప్పాలంటే.. లాస్ట్ మీకున్న ఏకైక ఆయుధం..ఆమెను వేశ్య అనడం. తను బ్లూ ఫిల్మ్స్ యాక్ట్ చేసింది.. ఇలా మాట్లాడితే.. మేము భయపడతామని మీరు అనుకుంటే.. మీరు చాలా తప్పు చేస్తున్నారు. సరే.. మీరు ఇలా అడిగారు.. నేను మిమ్మల్ని ఒకటి అడగనా.. ? బండారు గారు మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీ స్థాయికి మమ్మల్ని దిగజార్చొద్దు. ఇలా మాట్లాడడం వలన మీకు వచ్చింది ఏంటి.. సమాజంలో గౌరవమా..?. ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకొని క్షమాపణలు చెప్పండి. బి ఏ మ్యాన్.. బి ఏ ఫ్యామిలీ మ్యాన్.. లేకపోతే జీవితం మొత్తం పిరికిపందల ఉండు.. ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

https://x.com/NtvTeluguLive/status/1710289215739642348?s=20