Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు, ఉద్యోగుల బదిలీలపై నిషేధం విధించారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీఈవో ఎంకే మీనా… 2024 ఓటర్ల తుది జాబితా రూపొందే వరకూ నియామకాలు, బదిలీలపై ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.. ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భాగస్వాములైన సిబ్బంది ఖాళీల పైనా అక్టోబర్ 10 తేదీలోగా వివరాలివ్వాలని జిల్లా కలెక్టర్లు సహా ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల ప్రక్రియలో ఉన్న వారి బదిలీకి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ. ఫొటో ఓటర్ల తుది జాబితా రూపకల్పన కోసం అన్ని ఖాళీలను అక్టోబర్ 10వ తేదీ లోగా భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. 2023 అక్టోబర్ 27 నాటికి ముసాయిదా జాబితా, అలాగే 2024 జనవరి 5 తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామన్న పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం.. సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. కాగా, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో.. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల జరగనున్న విషయం విదితమే.