INDIA Bloc: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కలిశారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో చివరిసారిగా సమావేశం కాగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి కోసం ముందుకు సాగే ప్రణాళికపై చర్చించినట్లు తెలిసింది. ముంబయి సమావేశం అనంతరం మళ్లీ ప్రతిపక్ష కూటమి సమావేశం కాలేదని, త్వరలో సమావేశం కావచ్చని పలు వర్గాలు తెలిపాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టాలని భావిస్తున్న కూటమికి సంబంధించిన మార్గాన్ని ముగ్గురు నేతలు చర్చించారు. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. వారు ఇండియా కూటమి తదుపరి సమావేశానికి సంబంధించిన ప్రణాళికలను కూడా రూపొందించారని రాజకీయ వర్గాలు వెల్లడించాయి.
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు శరద్ పవార్‌తో తన సమావేశానికి సంబంధించి చిత్రాలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. దేశ ప్రజల గొంతును మరింత పెంచడానికి రాహుల్ గాంధీతో పాటు తనను శరద్ పవార్ కలిశారని ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు. మేము ప్రతి సవాల్‌కు సిద్ధంగా ఉన్నామని.. ఆయన ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ ట్విటర్ పోస్ట్‌కు ట్యాగ్‌లైన్ ఉపయోగించారు.
అక్టోబర్‌లో భోపాల్‌లో జరగాల్సిన ఇండియా కూటమి ఉమ్మడి బహిరంగ సభ రద్దయిన తర్వాత శుక్రవారం చర్చలు జరిగాయి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్‌తో సహా డీఎంకే నాయకులు చేసిన ప్రకటనలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ వ్యతిరేకతతో దీనిని నిర్వహించలేకపోయారని పలు వర్గాలు తెలిపాయి. ఇండియా కూటమి ప్రతిపక్ష నేతల తదుపరి సమావేశం పశ్చిమ బెంగాల్లో నిర్వహించాలని కొందరు ప్రతిపక్ష నేతలు సూచిస్తున్నారు.