Leading News Portal in Telugu

ఏషియన్ గేమ్స్ లో భారత్ పతకాల సెంచరీ | medals century for bharat in asian games| india| record| kabaddi| more


posted on Oct 7, 2023 10:41AM

నవ క్రీడా భారతం ఆవిష్కృతమైందని దేశం సంబరాలు చేసుకుంటున్నది. చైనా వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023లో ఇండియా చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఏషియన్ గేమ్స్ లో పతకాల సంచరీ సాధించింది.

భారత పతకాల వేట ఇంకా కొనసాగుతోంది.  శనివారం ఉదయం భాతర మహిళల కబడ్డీ జట్లు చైనీస్ తైపీపై విజయం సాధించి పతకాన్ని ఖాతాలో వేసుకోవడంతో భారత్ ఈ ఏషియన్ గేమ్స్ లో పతకాల సెంచరీ సాధించింది.  

ఇప్పటి వరకూ ఈ గేమ్స్ లో ఇండియా పాతిక స్వర్ణ, 35 రజతం, 40 కాంస్య పతకాలు సాధించింది. మొత్తం గా వంద పతకాలతో భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. 2018 ఏషియన్ గేమ్స్ లో ఇండియా సాధించిన పతకాల సంఖ్య 70. ఇప్పటి వరకూ ఏషియన్ గేమ్స్ లో భారత్ రికార్డు అదే.  ఈ సారి ఆ రికార్డును ఇండియా బ్రేక్ చేసింది.

 కాగా, ఈ ఏడాది చైనాలో జరుగుతోన్న ఏషియన్  గేమ్స్ లో భారత్  పతకాల వేట కొనసాగుతోంది.  నేడు, రేపు జరిగే ఈవెంట్స్ లో భారత్ ఖాతాలో మరికొన్ని పతకాలు పడే అవకాశాలున్నాయి.