Hyderabad: ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది. ఒకరు పాటల్లో ఫస్ట్ ఉంటె మరొకరు ఆటల్లో ముందుంటారు. ఎవరిలో ఏ టాలెంట్ ఉందొ గుర్థించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది, తల్లిదండ్రుల్ది. అలానే ప్రతిభ ఉన్న యువతకి ఆ ప్రతిభను నిరూపించుకునేలా అన్ని సౌకర్యాలను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇందులో భాగంగా క్రీడాకారులకు ఎన్నో సదుపాయాలను కల్పిస్తున్నారు. అలానే స్టేడియంలు కడుతున్నారు. అయితే అందులో కొన్ని నిర్మాణాలు మాత్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా పశువులకు అడ్డాగా మారుతున్నాయి. ఇలాంటి ఘటన ఒకటి తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
Read also:Weather alert : పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
వివరాలలోకి వెళ్తే.. హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో 100 కోట్లు ఖర్చు చేసి సైకిల్ ట్రాక్ నిర్మించారు. అంతర్జాతీయ క్రీడలకు వేదిక నిలవాల్సిన సైకిల్ ట్రాక్ బర్లకు నీడగా నిలుస్తోంది. సైకిల్ ట్రాక్ పైన గేదెలు నడుస్తున్నాయి. చూసిన వాళ్ళకి ఇదేదో గేదెల ఫ్యాషన్ షో అనిపించేలా ఉంది ఆ సంఘటన. దీని ప్రారంభోత్సవం గత వారమే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జరిగింది. ప్రారంభం జరిగి వారం దాటక ముందే సైకిల్ ట్రాక్ పైన గేదెలు తిరుగుతున్నాయి. సైకిల్ ట్రాక్ పైన 24 గంటలు సి.సి. టివి మానిటరింగ్ ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో సైకిల్ ట్రాక్ పైన గేదెల సంచారానికి కారణం కేవలం హెచ్ఎండీఏ అధికారుల నిర్లక్ష్యమే అంటున్నారు ఈ ఘటన చుసిన వారంతా.