Leading News Portal in Telugu

Google Pixel 7: అదిరిపోయే ఆఫర్.. రూ. 14,899 కే.. కేవలం కొద్ది రోజులు మాత్రమే..


గూగుల్ కంపెనీ ఇటీవల కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. గూగుల్ పిక్సెల్ 8 ను కొద్ది రోజుల క్రితం మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. దాంతో 7 సిరీస్ ఫోనలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను అందిస్తుంది.. ఈ ఫోన్లను కొనాలని అనుకొనేవారు.. ఇప్పుడే కొనిసెయ్యండి.. ఎందుకంటే ఇలాంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు..

పిక్సెల్ 7ని కేవలం రూ.14,899కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్‌లో మీరు తక్షణ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందుతారు. Pixel 7 ఫోన్‌లో టిక్ బ్లర్ వీడియో ఫీచర్ అందించబడింది. ఈ ఫీచర్ ద్వారా, వీడియోలోని బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అవుతుంది. సబ్జెక్ట్‌పై గరిష్ట ఫోకస్ ఉంచబడుతుంది. అలాగే , ఈ Google ఫోన్ Tensor G2 చిప్‌సెట్‌తో వస్తుంది.. ఈ ఫోన్ ఫీచర్స్ ను చూస్తే..

ఇది 6.3-అంగుళాల పూర్తి-HD+ OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లోని ప్రాసెసర్ కోసం Google Tensor G2 చిప్‌సెట్ ఉపయోగించబడింది. Google Pixel 7లో 8GB RAM ఉంది.. కెమెరా ప్రియులకు ఇది బెస్ట్ అనే చెప్పాలి.. మొదటి కెమెరా 50MP, రెండవ కెమెరా 12MP. ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 10.8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. అంతే కాకుండా వీడియోల కోసం ఈ ఫోన్‌లలో టిక్ బ్లర్ వీడియో ఫీచర్ కూడా అందించబడింది. ఈ ఫీచర్ ద్వారా, వీడియోలోని బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అవుతుంది.. వీడియో క్వాలిటీ బాగుంటుంది..

ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది..ఇక్కడ దీని ధర రూ. 59,999. కానీ ప్రస్తుతం ఈ ఫోన్‌ను రూ. 41,999కి కొనుగోలు చేయవచ్చు.. పాత ఫోన్ ఎక్సెంజ్ తో అయితే… రూ. 27,100 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. దీని ప్రకారం.. మీరు Google Pixel 7ని కేవలం రూ.14,899కి కొనుగోలు చేయవచ్చు.. అంటే ఇది కళ్లు చెదిరే ఆఫర్.. త్వరపడండి..