Best 5G Smartphones under 15000 india: ఈ కామర్స్ సైట్స్ పుణ్యమాని దసరా పండుగ ముందుగానే వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు సేల్స్ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ను ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించగా.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ను అమెజాన్ ఆరంభించింది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. దాంతో చాలా తక్కువ ధరకే కొన్ని స్మార్ట్‌ఫోన్స్ కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్‌లో రూ. 15 వేలలోపు ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఏవో ఓసారి చూద్దాం.
Redmi Note 12 5G:
రెడ్‌మీ నోట్ 121 ఫోన్ భారతదేశంలో ఈ ఏడాది జనవరిలో రూ. 17,999కి ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 15,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.67 అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్, 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
Realme 11X 5G:
రియల్‌మీ 11 ఎక్స్ ఫోన్ ఆగస్టులో భారతదేశంలో ప్రారంభమైంది. రూ. 14,999 ధరతో ఈ ఫోన్ లాంచ్ కాగా.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు. అదనపు బ్యాంక్ డిస్కౌంట్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ 6.72 ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
Poco X5 5G:
పోకో ఎక్స్5 ఫోన్ మార్చిలో భారతదేశంలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 20,999గా ఉండగా.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు రూ. 14,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.67 ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
Infinix Note 30 5G:
ఇన్ఫీనిక్స్ నోట్ 30 ఫోన్ గత జూన్‌లో భారతదేశంలో ప్రారంభమైంది. ఈ ఫోన్ రూ. 14,999 ధరతో లాంచ్ కాగా.. ప్రస్తుతం రూ. 13,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.78 ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్, 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.