Leading News Portal in Telugu

OnePlus Nord CE 3 Lite 5G Price: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ ధర!


Buy OnePlus Nord CE 3 Lite 5G Smartphone Rs 17,499 in Amazon Great Indian Festival 2023: దసరా పండగ సందర్భంగా ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఆఫర్ల జారత మొదలైంది. అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ నడుస్తోంది. అక్టోబర్ 7న ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ అందుబాటులో ఉండగా.. ఈ రోజటి (అక్టోబర్ 8) నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అమెజాన్‌లో పలు స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. అందులో ‘వన్‌ప్లస్‌’ ఫోన్‌లపై భారీగా ఆఫర్లు ఉన్నాయి.

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ధర భారీగా తగ్గింది. గతంలో పోల్చితే చాలా తక్కువ ధరకే ప్రస్తుతం ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. నార్డ్‌ సీఈ 3 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ (OnePlus Nord CE 3 Lite 5G 8GB RAM, 128GB) ధర భారతదేశంలో రూ. 19,999గా ఉంది. అయితే ఈ ఫోన్‌ను అమెజాన్ నుంచి రూ. 17,499కే కొనగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లు, కూపన్ ఆఫర్‌లను వినియోగించుకుంటే ఇంత తక్కువకు ఈ ఫోన్ మీ సొంతం అవుతుంది.

వన్‌ప్లస్‌ సీఈ3 లైట్‌ రెండు వేరియంట్లలో వస్తోంది. 8జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ. 19,999గా ఉండగా.. 8జీబీ+254 జీబీ వేరియంట్‌ ధర రూ. 21,999గా ఉంది. పాస్టల్‌ లైమ్‌, క్రోమాటిక్‌ గ్రే రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 13.1తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. 6.72 ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120Hz డైనమిక్‌ రీఫ్రెష్‌ రేట్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌ను అమర్చారు.

ఫొటోలు, వీడియోల కోసం వన్‌ప్లస్‌ సీఈ3 లైట్‌లో వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. ఇందులో 108 మెగాపిక్సల్ శాంసంగ్‌ HM6 సెన్సర్‌, 2ఎంపీ మ్యాక్రో కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ను అమర్చారు. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67W సూపర్‌ వూక్‌ వైర్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఈ ఫోన్లో ఉంది. కేవలం 0-80% బ్యాటరీని 30 నిమిషాల్లో ఛార్జ్‌ అవుతుంది.