2023 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ రెండో విజయంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు న్యూజిలాండ్, నెదర్లాండ్స్ 2-2 మ్యాచ్‌లు ఆడాయి. అందులో కివీస్ జట్టు రెండింటిలో రెండు గెలిచింది. కాగా.. నెదర్లాండ్ జట్టు రెండింటిలోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. న్యూజిలాండ్ రెండో మ్యాచ్‌లో గెలిచి 4 పాయింట్లు, నెట్ రన్ రేట్ +1.958 సాధించింది. ఓటమి తర్వాత నెదర్లాండ్స్ నెట్ రన్ రేట్‌తో 8వ స్థానానికి చేరుకుంది.
Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. బంగారం ధరలు పెరుగుతాయా?
మొదటగా టాస్ గెలిచిన నెదర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 322/7 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ లో ఓపెనర్లు కాన్వే 32, యంగ్ 70 పరుగులతో మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన రచిన్ రవీంద్ర 51, డారెల్ మిచెల్ 48, కెప్టెన్ లాథమ్ 53, ఫిలిప్స్ 4, చాంప్ మన్ 5, మిచెల్ సాంట్నర్ 36, మ్యాట్ హెన్నీ 10 పరుగులు చేశారు. నెదర్లాండ్ బౌలింగ్ లో ఆర్యన్ దత్, మీకెరన్, వాన్ డర్ మెర్వే తలో 2 వికెట్లు తీయగా.. లీడెడ్ ఒక వికెట్ తీశాడు.
World Cup 2023: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎంత మంది సెక్యూరిటీ తెలుసా..?
ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్.. విక్రమ్ జిత్ సింగ్ 12, ఓడెడ్ 16, అకీర్ మన్ 69, లీడెడ్ 18, తేజ నిడమనూరు 21, కెప్టెన్ ఎడ్వర్డ్స్ 30, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 29, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే 1, ర్యాన్ క్లీన్ 8, ఆర్యన్ దత్ 11, పాల్ వాన్ మీకెరెన్ 4 పరుగులు చేశారు. ఇక కివీస్ బౌలింగ్ లో మిచెల్ సాంట్నర్ 5, మ్యాట్ హెన్నీ 3, రచిన్ రవీంద్ర ఒక వికెట్ తీశాడు.