కాంగ్రెస్ తో పొత్తు అంశంలో రాజకీయ అవగాహన కుదిరిందని వెల్లడించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అయితే.. సీట్ల అంశం మాత్రమే తేలాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీట్ల అంశం కూడా రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని, ప్రస్తుతం కమ్యూనిస్టులకు చెరో రెండు సీట్లు అన్నది ప్రచారం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అలాంటి ప్రతిపాదన మాకు ఇంకా రాలేదని, జాతీయస్థాయిలో ఇండియా కూటమిదిలో కాంగ్రెస్ వామపక్షాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇక్కడ తెలంగాణలోనూ ఆ తరహా రాజకీయ అవగాహనతో ముందుకెళ్తామని, పొత్తులో సీట్ల అంశం మీద తొందర లేదు నామినేషన్లు వేసే వరకు సమయం ఉన్నదన్నారు సీపీఐ నారాయణ.
సీట్లపై చర్చలు కొనసాగుతున్నాయని, ఎన్నికల షెడ్యూల్ వస్తుందని బీఆర్‌ఎస్ వాళ్లకు కావాల్సిన అధికారులను రెండు రోజుల ముందే బదిలీ చేసుకుంటున్నారన్నారు. అప్పటిదాకా పనిచేసిన అధికారులను అవమానపరుస్తూ బదిలీ చేస్తున్నారని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ తో అవగాహనతో ముందుకెళ్తామన్నారు. పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు అంశంలో తొందర లేదన్నారు. నామినేషన్లు వేసే వరకు సమయం ఉందన్నారు. ఇక అంతకు ముందు సీపీఎం పార్టీకి భద్రాచలం, మిర్యాలగూడ, సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.