Leading News Portal in Telugu

Home Remedies : ఇలా చేస్తే మీ ఇంట్లో బల్లులు మాయం..


Home Remedies: మనకి ఎలాంటి హాని చేయకపోయిన, దాని వల్ల మంచి జరుగుతున్నా మనకి నచ్చని ఏకైక జీవి బల్లి. బల్లి ఇంట్లో ఉంటే పురుగులు ఉండవు. ఎందుకంటే బల్లి పురుగుల్ని తింటుంది. అయితే బల్లి చేసే మేలుని పక్కన పెడితే ఆ బల్లిని చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది చాలా మందికి. దీనితో బల్లిని తరిమెయ్యాలని విశ్వప్రయత్నాలు చేసి చివరికి అలిసిపోతారు. కానీ బల్లి మాత్రం ఇల్లు విడిచిపోదు. అయితే ఇలా చేస్తే మాత్రం బల్లి ఇల్లు వదిలి పారిపోక తప్పదు. అలా బల్లిని తరిమెయ్యాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు చూదాం.

Read also:Healthy diet : మధుమేహం వాళ్ళు పాటించాల్సిన మెనూ ఇదే..

బల్లి ఇంట్లోకి రావడానికి ముఖ్య కారణం అపరిశుభ్రత. అందుకే ఇంటిని ఎప్పడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక బల్లులకి సిట్రస్ వాసన, కర్పూరం వాసన పడదు. కనుక బల్లులు తిరిగే ప్రదేశంలో ఓ నిమ్మకాయను కోసి పెట్టండి. అలానే కర్పూరం బిళ్లలను ఉంచిన బల్లులు రావు. ఇక బల్లులకు వేడి వాతావరణం ఉండాలి. కనుక మీరు ఎప్పుడూ ఇంట్లో వాతావరణాన్ని చల్లగా ఉండేలా చూసుకోండి. ఓ స్ప్రే బాటిల్ లో ఐస్ వాటర్ పోసి బల్లుల పైన స్ప్రే చేస్తే బల్లలు వెళ్లిపోతాయి. అలానే నెమలీకలను చూసిన బల్లులు బయపడతాయంట. ఓ సారి ప్రయత్నించండి. బల్లులు ఎక్కువగా దొడ్డి దారిన వస్తాయి. కనుక దొడ్డి దారిని మూసివేయండి. ఇంటికి పగుళ్లు ఉన్న ఆ పగుళ్ల నుండి కూడా వస్తాయి కనుక పగుళ్లు లేకుండా చూసుకోండి. ఇక బల్లులు పిల్లికి కూడా బయపడతాయి. మీరు పిల్లిని పెచుకుంటున్నట్లు అయితే మీకు బల్లుల బెడద తీరినట్టే.