Leading News Portal in Telugu

Israel-Hamas: ఇజ్రాయిల్‌పై దాడి… కెనడా, యూకేలో సంబరాలు..



London

Israel-Hamas: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై తీవ్రమై ఉగ్రదాడి చేశారు. ఈ దాడిని ఇండియా, యూకే, యూఎస్ఏ, సౌదీ అరేబియా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల అధినేతలు ఖండించారు. ఇప్పటికే ఈ దాడుల వల్ల ఇజ్రాయిల్ లో 300 మందికి పైగా మరణించారు. మరోవైపు ఇజ్రాయిల్ వైమానికి దళం గాజాలోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తోంది. గాజాలో కూడా 250 మందికి పైగా ప్రజలు చనిపోగా.. 1600 మంది వరకు గాయపడినట్లు పాలస్తీనా వైద్య విభాగం వెల్లడించింది.

ఇదిలా ఉంటే కొన్ని దేశాలు మాత్రం హమాస్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇరాన్ ఇప్పటికే ఈ దాడులకు బహిరంగ మద్దతు తెలియజేసింది. పాకిస్తాన్, సిరియా, లెబనాన్ వంటి ముస్లిం దేశాలు బయటకు చెప్పకున్నా అక్కడి ప్రజలు ఇజ్రాయిల్‌పై దాడిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Read Also: IND vs AUS: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్! తుది జట్లు ఇవే

యూకే, కెనడాల్లోని పాలస్తీనా, హమాస్ మద్దతుదారులు, ఇజ్రాయిల్ వ్యతిరేకులు రోడ్లపై వచ్చి పాలస్తీనా జెండాలతో ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, యూకే ప్రధాని రిషి సునాక్ వంటి వారు ‘‘ఇజ్రాయిల్ కి అండగా ఉన్నాం’’ అని చెబుతున్నారు. కానీ అక్కడ పరిస్థితి వేరేలా కనిపిస్తోంది. లండన్ నగరంలో పాలస్తీనా జెండాలతో వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోవడం, కెనడాలో పాలస్తీనా జెండాలతో మద్దతు ప్రకటించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దీనిపై లండన్ పోలీసులు స్పందించారు. ఈ ఘటన మా దృష్టికి వచ్చింందని, ఇవి భవిష్యత్తులో నిరసనలకు దారి తీయొచ్చు, లండన్ పౌరులకు ఆటంం కలిగించే విధంగా చర్యలు చేపడితే ఉపేక్షించమని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. హమాస్ వంటి ఉగ్రవాదులు తమదాకా రారని యూరప్ ప్రజలు భావించడం మూర్ఖత్వం అని ట్వీట్స్ చేస్తున్నారు.