తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతలో పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాలలో వాహనాలు తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ సందర్భంగా ఎన్టీవీతో జూబ్లీహిల్స్ సీఐ రవీంద్ర మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎలక్షన్స్ కోడ్ అమలు ఉందని, మా పైస్థాయి అధికారుల ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ శ్రీనగర్ కాలనీ ప్రగతి నగర్ కాలనీలో సర్ప్రైజ్ వెహికిల్ చెకింగ్ చేస్తున్నామన్నారు. 3 గంటల నుండి తనిఖీలు నడుస్తున్నాయని, ఎవరు కూడా 50వేలకు మించి నగదు బయటికి తీసుకురాకూడదన్నారు. ఒకవేళ 50 వేల మించి నగదుతో పాటు బంగారు నగలు బయటికి తేస్తె వెంట సరైన పత్రాలు ఉండాలని సూచించారు. మద్యం నగదుపై ఫోకస్ పెట్టామని, డే అండ్ నైట్ విస్తృత స్థాయిలో వాహనాలు తనిఖీలు చేస్తామన్నారు.
ఇదిలా ఉంటే.. తనిఖీల్లో సరైన పత్రాలు చూపించని నగదును, బంగారాన్ని, వెండిని స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారానగర్‌లో పోలీసులు 5.65 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిజాం కాలేజీ సమీపంలో గేట్ నెంబర్ 1 వద్ద 7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడే 300 కిలోల వెండిని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఫిలింనగర్ పరిధిలోని నారాయణమ్మ కాలేజీ సమీపంలో ఓ కారులో ఎలాంటి రసీదు లేని రూ.30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాల్లోను పెద్ద మొత్తంలో నగదు, బంగారం, అక్రమ మద్యం వంటి వాటిని పట్టుకున్నారు.