Leading News Portal in Telugu

Minister Malla Reddy : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి పై మంత్రి మల్లారెడ్డి సెటైర్లు


మల్కాజిగిరి నియోజకవర్గం లోని ఆనంద్ బాగ్ బృందావన్ గార్డెన్స్ లో బిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 5సంవత్సరాలలో మల్కాజిగిరి ప్రజలు,నాయకులు భయం భయంగా బ్రతికారని , ఇక భయపడాల్సిన అవసరం లేదని పరోక్షంగా మైనంపల్లి పై సెటైర్లు వేసారు. కొరొనా సమయంలో ప్రజలందరి జీవితం అతలకుతం అయినట్లు ఈ 5సంవత్సరాలు మల్కాజిగిరి ప్రజల జీవితాలు అతలకుతం అయిందని మంత్రి మల్లారెడ్డి మైనంపల్లిపై సేటర్లు వేసారు.ఇప్పటివరకు మల్కాజిగిరి నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ మల్కాజిగిరి ఎమ్మెల్యే ఉపయోగించలేదని ఆరోపించారు. మైనంపల్లి ని ఎవ్వరూ మోసం చేయలేదని , భస్మాసురుడిలాగా తనంతట తానే తన రాజకీయ భవిష్యత్తును అంతం చేసుకున్నారని సేటర్లు వేసారు.

అక్రమ కేసుల్లో ఇరికిండంతో పాటు దాడులకు పాల్పడే వ్యక్తి నుంచి నేడు విముక్తి లభించిందన్నారు. నిత్యం భగవంతుడిపై ఒట్టు పెట్టుకుంటూ ఏడుకొండల వెంకన్న సన్నిధిలో పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యాలే ఆయన పతనానికి కారణమైందన్నారు. బస్మాసురిడి హాస్తం తనపైనే పెట్టుకున్నట్లు, మైనంపల్లి తానకు తానే పార్టీని వీడారన్నారు. గతంలో ఎవరు చేసిన పాపం వారి కుటుంభ సభ్యులకు తగిలేదని కానీ నేడు మాత్రం ఎవరి పాపం వారికే అప్పడే చుట్టుకుంటుందన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభ్యర్థి విజయానికి కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో జరిగే పనులను అడ్డుకుంటే సహించేది , ప్రతి కార్యకర్తలకు తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.