Hamas Attack On Isreal:: ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి ఆ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పటిష్ట ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నా కూడా ఇజ్రాయిల్ ఈ దాడిని పసిగట్ట లేకపోయింది. హమాస్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా మరణించారు. గాజా నుంచి ఇజ్రాయిల్ ప్రాంతాల్లోకి చొరబడిన ఉగ్రవాదులు ఇజ్రాయిలీ పౌరులను బందీలుగా పట్టుకెళ్లారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన వీడియోలో ఇంటర్నెట్ లో వైరలవుతున్నాయి.
తాజాగా ఓ యువతిని హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన ఘటన కంటతడి పెట్టిస్తోంది. 25 ఏళ్ల నోవా అర్గమణి అనే యువతిని మోటార్ సైకిల్ పై కూర్చోబట్టుకుని కిడ్నాప్ చేస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో యువతి తనను చంపొద్దని వేడుకుంటున్నట్లు ఉంది. ‘‘ నన్ను చంపొద్దు అని అరుస్తుండటం, వెనకాల హమాస్ మద్దతుదారులు బెదిరించడం కనిపిస్తుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ అవి నాథన్ ను కూడా హమాస్ తీవ్రవాదులు తీసుకెళ్తున్నట్లు’’ వీడియో చూపెడుతోంది.
ఈ జంట ఒక మ్యూజిక్ ఫెస్టివల్ కి హజరయ్యేందుకు ఇజ్రాయిల్ దక్షిణ భాగానికి వెళ్లిన సమయంలో ఉగ్రవాదుల చేత కిడ్నాప్ అయ్యారు. అవి నాథన్ సోదరుడు మోషఏ ఓర్ అతను తప్పిపోయినట్లుగా తెలిపారు. అర్గమణి కిడ్నాప్ గురించిన వివరాలను యువతి కుటుంబానికి తెలియజేశారు. ఆమెను ఫోన్ లో సంప్రదించడానికి ప్రయత్నించాం, అందుబాటులో లేదని ఇజ్రాయిల్ నేషనల్ న్యూస్ నివేదించింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం వనవవారం ఉదయం మ్యూజిక్ కార్యక్రమానికి వచ్చినవారిలో చాలా మంది తప్పిపోయినట్లుగా నివేదికలు వస్తున్నాయి.
Noa was partying in the south of Israel in a peace music festival when Hams terrorists kidnapped her and dragged her from Israel into Gaza.
Noa is held hostage by Hamas.
She could be your daughter, sister, friend.#BringBackOurFamily pic.twitter.com/gi2AStVdTQ
— Hen Mazzig (@HenMazzig) October 7, 2023