జగన్ సర్కార్ అరాచక పాలనకు అండా దండా కేంద్రామే! | center support to jagan sarkar anarchy| frmp| debts| limit| cross| purandeswari| complaint| nirmala
posted on Oct 10, 2023 2:53PM
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ఆర్థిక అరాచకత్వం, అరాచక పాలన కొనసాగుతోందనడంలో ఎవరిలోనూ ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో బీజేపీకి కూడా స్పష్టత ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఆద్వాన్నంగా ఉందో, రాష్ట్రంలో పాలన ఎంత అరాచకంగా సాగుతోందో చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. మోడీ విశాఖ పర్యటన సందర్భంగా వాడవాడలా వైసీపీ పాలనా వైఫల్యాలపై చార్జిషీట్లు ధాఖలు చేయాలని రాష్ట్ర బీజేపీ నాయకులకు పిలుపు కూడా ఇచ్చారు. పిలుపు ఇవ్వడం కాదు.. ఆదేశించారు. ఇందులో రహస్యమేమీ లేదు.
అయినా అప్పట్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా అప్పటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు.. మోడీ ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం నాయకులు సోము వీర్రాజుపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. బీజేపీ అధిష్ఠానం కూడా రాష్ట్రంలో పార్టీ తీరుపై కన్నెర్ర చేసింది. సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఆయన స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన క్షణం నుంచి జగన్ సర్కార్ చేస్తున్నఅడ్డగోలు అప్పులపై పూర్తి వివరాలతో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరి చెప్పారు. అక్కడితో ఆగకుండా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు రాష్ట్ర అప్పుల చిట్టా సమర్పించారు. ఇదంతా చూసి ఇక జగన్ సర్కార్ కు అప్పులు పుట్టవు, కేంద్రం ఏపీ పరిస్థితులపై దృష్టి సారించిందని అంతా భావించారు. కానీ వాస్తవంగా అందుకు భిన్నంగా జరిగింది. పురంధేశ్వరి భేటీ తరువాత రాష్ట్ర అప్పుల పరిధి (ఎఫ్ఆర్బీఎం) విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభల్లో రెండు విభిన్నప్రకటనలు చేసి,వాస్తవ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం లేకుండా చేశారు.
నిజానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అడుగుపెట్టినప్పటి నుంచి, ఆర్ధిక క్రమశిక్షణ గాడి తప్పింది. జగన్మిహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తోలి క్షణం నుంచే, సంక్షేమాన్ని గీత దాటించేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు సంక్షేమం ముసుగు కప్పి, బటన్ నొక్కుడు మాత్రమే పాలన చేసేశారు. ఆర్థిక క్రమశిక్షణ అన్న మాటకు అర్ధమే లేకుండా చేసేశారు. అప్పులు చేసి మరీ ఓటు బ్యాంకు పథకాలతో ప్రజలను ఆకర్షించడమే లక్ష్యం అన్నట్లుగా పాలనకు గాడి తప్పించేశారు. ఈ విషయాలన్నిటిపై తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతూనే ఉంది. అయితే అడ్డగోలు అప్పులను నిరోధించాల్సిన కేంద్రం మాత్రం ఏపీ విషయంలో ఔను ఒక్క ఏపీ విషయంలో మాత్రమే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది.
జగన్ సర్కార్ ఎంత అడ్డగోలుగా అప్పులకు ఎగబడుతోందో.. అంతే అడ్డగోలుగా అందుకు మోడీ సర్కార్ అనుమతులు ఇచ్చేస్తోంది. రాష్ట్రంలో సొంత బలం లేని బీజేపీ.. తమ చెప్పుచేతల్లో ఉండే జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వానికి అన్ని విధాలుగా అండా, దండా అందిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను, ఓ వంక విమర్శిస్తూనే, మరో వంక జగన్ రెడ్డి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తోంది. అంటే కొట్టినట్లు బీజేపీ చేస్తుంటే.. ఏడ్చినట్లు వైసీపీ చేస్తున్నదన్నదన్న మాట. ఈ విధంగా ఇరు పార్టీల మధ్యా రహస్య మైత్రి బహిరంగంగా కొనసాగుతోందని, పిల్లి కళ్లు మూసుకు పాలు తాగుతూ ఎవరూ గమనించడం లేదనుకున్నచందంగా వైసీపీ, బీజేపీలు వ్యవహరిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.