Bhupesh Baghel: సీరియస్ మీటింగ్లో ముఖ్యమంత్రి క్యాండీక్రష్ గేమ్ ఆటడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన మరెవరో కాదు ఛత్తీస్గఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేష్ బాఘేల్. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంగళవారం కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరైన బఘేట్ తీరిగ్గా ఆయన మొబైల్ తీసి క్యాండీ క్రష్ గేమ్ ఆడాడు. దీనికి సంబంధించిన ఫోటో బయటకు రావడంతో బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.
దీనికి సంబంధించిన ఫోటోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఎంత ప్రయత్నించినా.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదని తెలిసీ సీఎం భూపేష్ బఘేట్ రిలాక్స్ అవుతున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే బదులు క్యాండీక్రష్ ఆడుకోవడమే మేలని భావించి ఉంటారని చురకలంటించింది.
ఇదిలా ఉంటే బీజేపీ విమర్శలకు బఘేల్ స్పందించారు. అంతకుముందు నేను బైక్ నడిపినా, సంప్రదాయ ఛత్తీస్గడ్ ఆటలు ఆడితే బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది, ఇప్పుడు సమావేశానికి ముందు క్యాండీక్రష్ ఆడితే ఆ ఫోటోలను షేర్ చేసి విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. నిజం చెప్పాలంటే నేనంటే బీజేపీకి గిట్టడం లేదు, కానీ అధికారంలో ఎవరుండాలి అని నిర్ణయించేది రాష్ట్ర ప్రజలే అని, నేను సంప్రదాయ ఆటలు ఆడుతా, క్యాండీక్రష్ నా ఫేవరెట్ గేమ్, ఇప్పటి వరకు అన్ని లెవల్స్ దాటేశాను, ఇక ముందు కూడా దీన్ని కొనసాగిస్తా.. ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయం ఛత్తీస్గడ్ మొత్తానికి తెలుసని బీజేపీని విమర్శించారు.
छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल भी निश्चिंत हैं, उन्हें पता है कि कितनी भी माथा-पच्ची कर लें सरकार तो आनी नहीं है।
शायद इसीलिए कांग्रेस के प्रत्याशी चयन से संबंधित बैठक में ध्यान देने के बजाय उन्होंने CANDY CRUSH खेलना उचित समझा। 😂 pic.twitter.com/bcer39zx4o
— Amit Malviya (@amitmalviya) October 10, 2023
पहले भाजपा को ऐतराज़ था कि मैं गेड़ी क्यों चढ़ता हूं, भौंरा क्यों चलाता हूं, गिल्ली डंडा क्यों खेलता हूं, प्रदेश में छत्तीसगढ़िया ओलंपिक क्यों हो रहे हैं?
कल एक बैठक से पहले फ़ोटो मिल गई जिसमें मैं कैंडी क्रश खेल रहा हूं। अब भाजपा को उस पर ऐतराज़ है।
दरअसल उनको मेरे होने पर ही… pic.twitter.com/PtEfmrSrps
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 11, 2023