Mega 157: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఒక హిట్ .. ఒక ప్లాప్ అందుకున్నాడు. మొదటి నుంచి కూడా విజయాపజయాలను లెక్కచేయకుండా ముందుకు దూసుకుపోతున్న మెగాస్టార్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి కళ్యాణ్ కృష్ణతో మెగా 156, రెండు వశిష్ఠ తో మెగా 157.. ఈ రెండు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఇందులో 156 కన్నా.. మెగా 157 పైనే అందరి చూపు ఉంది. ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పంచభూతాలను కలుపుతూ… మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి కథకు దగ్గరగా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆ సినిమాను రిఫరెన్స్ గా తీసుకొనే వశిష్ఠ ఈ కథ రాసుకున్నాడని సోషల్ మీడియా కోడై కూసింది.
Nayanthara: ఆ విషయంలో.. మీరో వర్గానికి ఇన్స్పిరేషన్ మేడమ్..
ఇక ఈ నేపథ్యంలోనే జగదేకవీరుడు అతిలోక సుందరి మేకర్స్ అయిన వైజయంతీ మూవీస్ ఒక పబ్లిక్ నోటిస్ ను షేర్ చేసింది. “సినిమాలోని స్టోరీ, కాన్సెప్ట్, పాత్రలు ఇలా దేన్ని కూడా తమ ప్రమేయం లేకుండా ఉపయోగించడానికి వీల్లేదని.. ఒకవేళ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని” చెప్పుకొచ్చారు. అంటే ఇన్ డైరెక్ట్ గా వశిష్ఠకు వైజయంతీ మూవీస్ .. వార్నింగ్ ఇచ్చిందన్నమాట. ఇక ఇందులో నిజమెంత అన్నది వశిష్ఠ తన స్నేహితుల వద్ద చెప్పాడట. జగదేక వీరుడు అతిలోక సుందరి కథకు తన కథకు ఉన్న కామన్ పాయింట్ కేవలం చిరంజీవి మాత్రమేనని, అసలు దానికి, దీనికి సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉంది అన్నది సినిమా చూస్తే కానీ తెలియదని అభిమానులు చెప్పుకొస్తున్నారు.