Fake Currency: ఏదైనా టాలెంట్ ఉంటేనే గా చేయగలం. మాకున్న టాలెంట్ ఎవరికీ లేదు అనుకుంటూ దొగనోట్లని ముద్రిస్తారు కొందరు కేటుగాళ్లు. ఆ నోట్లు చూడడానికి అచ్చం నిజమైన కరెన్సీ నోట్లు లాగే ఉంటాయి. దీనితో ఈ కేటుగాళ్లు ఆ నోట్లను అమాయక ప్రజలకి ఇచ్చి వాళ్ళదగ్గర ఉన్న అసలైన నోట్లను కాజేస్తారు. కానీ పొరపాటున కూడా బ్యాంకు లో దొగనోట్లను మార్చుకోవడానికి పోరు. ఎందుకంటే దొరికిపోతాం అని భయం. ఇక ఎటిఎం గురించి చెప్పాల్సిన పని లేదు దొంగ నోట్లను అలా పెడితే ఇలా పట్టేస్తుంది. బయట వ్యక్తుల దగ్గర నఖీలి నోట్లు దొరికాయంటే వాళ్ళు ముద్రించి అయినా ఉండాలి లేక పోతే మోసపోయి అయినా ఉండాలి. మరి బ్యాంక్ అధికారులే దొంగనోట్లను ఇస్తే.. వాళ్ళు మోసపోయినట్టా..? లేక ముద్రించినట్టా.? ఇప్పుడు ఇదే ప్రశ్న.
Read also:Khalistani terrorist : ఇండియాకు ఖలిస్థానీ టెర్రరిస్ట్ హెచ్చరిక.. వీడియో వైరల్
బ్యాంక్ అధికారులు మోసపోయి ఉంటె కస్టమర్ ఇచ్చింది అసలైన నోట్లా..? లేక నఖీలి నోట్ల అని చూసుకోనంత నిర్లక్ష్యంగా పామిచేస్తున్నారా ..? ముద్రించి ఉంటె బాధ్యతాయుత ఉద్యోగంలో ఉండి ఇవేం పనులు..? అనే సందేహం అందరికి కలుగుతుంది. వివరాలలోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రము కాన్పూరు లోని ఫుఖ్ రాయ ఎస్బిఐ శాఖ అధికారులు తాజాగా ఆర్బీఐ కి కొంత నగదు పంపారు. ఈ నేపథ్యంలో ఆ నగదుని పరిశీలించగా అవి అందులో కొన్ని నఖిలీ నోట్లని తేలింది. దీనితో ఆర్బీఐ పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు సంబంధిత బ్యాంకును తనికీ చెయ్యగా దొంగనోట్లు పట్టుబడ్డాయి. దొగనోట్లు దొరకడంతో పోలీసులు బ్యాంక్ ను సీజ్ చేసి అధికారులని అరెస్ట్ చేశారు.