Leading News Portal in Telugu

Arepally Mohan: బీజేపీలో భారీ చేరికలు.. నేడు ఆరెపల్లి మోహన్ తోపాటు బీఆర్ఎస్ నేతలు


Arepally Mohan: మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్‌ కె. లక్ష్మణ్‌, జాయినింగ్‌ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఈరోజు సాయంత్రం 5 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరనున్నారు. ఆరేపల్లి మోహన్‌తో పాటు స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, బీఆర్‌ఎస్‌కు చెందిన 100 మంది ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరనున్నారు. అనుచరులతో కలిసి కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి వచ్చిన ఆరెపల్లి మోహన్ బండి సంజయ్‌ను కలిశారు. దాదాపు అరగంటపాటు సంజయ్‌తో సమావేశమైన ఆరెపల్లి మోహన్.. పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

Read also: Rohit Sharma: రికార్డులపై ఎక్కువగా దృష్టి పెట్టను.. అలా చేస్తే..: రోహిత్‌ శర్మ

కాగా, 2009లో మానకొండూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరెపల్లి మోహన్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన మోహన్.. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలు కొందరిని మారుస్తారని తెలిసిన మోహన్ తనకు మానకొండూరు లేదా చొప్పదండి టిక్కెట్టు కేటాయిస్తారని ఆశించారు. అయితే, అలా జరగలేదు. ఈసారి కూడా టికెట్ దక్కకపోవడంతో ఆరెపల్లి మోహన్ అసంతృప్తితో ఉన్నారు. మానకొండూరు నుంచి సిట్టింగ్‌ అభ్యర్థికి టికెట్‌ కేటాయిస్తానన్న హామీ లభించకపోవడంతో మోహన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ నుంచి మానకొండూరు టికెట్ వస్తుందని ఆరెపల్లి మోహన్ ఆశిస్తున్నారు. దాదాపుగా ఆయనకు బీజేపీ టికెట్‌ కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికను బీజేపీ వేగవంతం చేసింది. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌