
సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ ఫిట్ గా ఉండే మహేష్ జిమ్ పోస్టులు చూస్తే సితార, గౌతమ్ లకి కూడా మహేష్ బాబు అన్న అయి ఉంటాడు అనుకోవడంలో తప్పు లేదులే అనిపించకమానదు. మెరుపు వేగంతో పరిగెడుతున్నాడు, ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తున్నాడు, ఎంత కష్టపడాలో అంతా కష్టపడుతున్నాడు. హీరో అంత ఫిట్ అండ్ యంగ్ గా కనిపించడం వెనుక ఇంత కష్టం ఉంటుంది అని తెలియజేస్తూ మహేష్ జిమ్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. “Nothing is ever black & white when it comes to hard work… shaping it up!!” అంటూ మహేష్ ఇన్స్టాలో పోస్ట్ చేసాడు. బైసెప్స్ చూపిస్తూ… పర్ఫెక్ట్ చెస్ట్ మైంటైన్ చేస్తూ మహేష్ పెట్టిన పోస్ట్ ఘట్టమనేని అభిమానులకి కిక్ ఇస్తోంది.
ఈ లేటెస్ట్ ఫోటో చూసిన మహేష్ ఫాన్స్, సోషల్ మీడియాలో #MaheshBabu టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా బాడీ పెంచే పనిలో ఉన్న మహేశ్ బాబు, పర్ఫెక్ట్ టోన్డ్ బాడీ షేప్ లోకి వస్తున్నట్లు ఉన్నాడు. ఎప్పుడూ ఫిట్ గానే ఉండే మహేశ్ బాబు… గుంటూరు కారం సినిమా అయిపోగానే రాజమౌళితో SSMB 29 సినిమా స్టార్ట్ చేయనున్నాడు. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం కూడా మహేశ్ బాబు ఫిజిక్ పెంచాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది స్టార్టింగ్ నుంచి రాజమౌళి, మహేశ్ బాబు సినిమా ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ అవనున్నాయి. మరి జిమ్ ఫొటోలతోనే కిక్ ఇస్తున్న మహేష్ బాబు కొత్త లుక్ లో ఏ రేంజులో కనిపిస్తాడో చూడాలి.