Leading News Portal in Telugu

Viral Video : వారెవ్వా.. మస్త్ నడుపుతున్నావ్ కాక.. వీడియో వైరల్..


Viral Video : వారెవ్వా.. మస్త్ నడుపుతున్నావ్ కాక.. వీడియో వైరల్..

ఈరోజుల్లో జనాలకు తెలివితేటలూ ఎక్కువవుతున్నాయి.. ఇంజనీర్స్ కన్నా ఎక్కువగా, సరికొత్తగా ఆలోచిస్తున్నారు.. చిన్న చిన్న వస్తువులను ఉపయోగించి అద్భుతమైన వాటిని తయారు చేస్తున్నారు.. వాటికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. అవి కాస్త ప్రశంసలను అందుకుంటూ నెట్టింట హల్ చేస్తాయి.. తాజాగా ఓ తాత వీడియో కూడా జనాలను ఆకట్టుకుంది.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. ఆ వీడియో గురించి వివరంగా తెలుసుకుందాం పదండీ..

సూరత్ వీధుల్లో ఓ పెద్దాయన ఉత్సాహంగా మోనోసైకిల్ నడుపుతున్నారు.. ఆ తాత నడిపిన మోనో సైకిల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.. సూరత్‌లో ఓ స్పెషల్ మోనోసైకిల్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ మోనోసైకిల్‌ను ఓ పెద్దాయన ఎంతో ఉత్సాహంగా నడుపుతున్నాడు. రోడ్లపై వెళ్లే వాహనదారులు ఆ వాహనాన్ని వింతగా చూసారు. ఈ ప్రత్యేక వాహనాన్ని ఏ బ్రాండ్ తయారు చేసింది? పబ్లిక్ రోడ్లపై దీనిని నడపడానికి రైట్స్ ఉన్నాయా? అనేది మాత్రం తెలియలేదు కానీ ఈ వాహనం మాత్రం చూపరులను తెగ ఆకట్టుకుంది..

ఓ ఇంస్టాగ్రామ్ వినియోగదారుడు షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. మెన్ ఇన్ బ్లాక్ ఫ్రాంచైజీలో K, J ఉపయోగించే గైరో సైకిల్ వాహనాన్ని ఈ మోనోసైకిల్ గుర్తు తెచ్చిందని చాలామంది నెటిజన్లు స్పందించారు. ఇక కొందరైతే వర్షం వచ్చినప్పుడు బురద నీరంతా తలపైకి వెళ్తుంది అంటూ కామెంట్లు చేసారు. మొత్తానికి ఈ మోనోసైకిల్ ను నడపడం వల్ల తాత సెలెబ్రేటి అయ్యాడు.. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా తాత గురించే మాట్లాడుతున్నారు.. మొత్తానికి సైకిల్ రైడ్ తో వార్తల్లో నిలిచాడు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి..