Leading News Portal in Telugu

Health Tips : ఏ కాలంలో ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా అవుతుందో తెలుసా?


Health Tips : ఏ కాలంలో ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా అవుతుందో తెలుసా?

ఒక్కో సీజన్ లో ఒక్కో కొత్త వ్యాదులు రావడం కామన్.. ఎక్కువగా వర్షకాలంలో వ్యాదులు వస్తాయని అందరు అనుకుంటారు కానీ వేసవి కాలంలో కూడా వ్యాధులు వస్తాయి.. ముఖ్యంగా ఈ కాలంలో ఫుడ్ పాయిజనింగ్ తో ఇబ్బంది పడుతుంటారు.. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం పెరుగుతు ఉంటుంది. ఎండాకాలంలో ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువ. అసలు వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతుంది.. అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హానీకర బ్యాక్టీరియా వెచ్చని ఉష్ణోగ్రతల్లో వృద్ధి చెందుతుంది. వేసవిలో ఆహారం కలుషితమయ్యే అవకాశం ఎక్కువ. మాంసం, పౌల్ట్రీ, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి ఆహారాలు ఎండలో లేదా వేడికి ఉంచితే అందులో బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే వేసవిలో ఆహారం త్వరగా చెడిపోతుంది. ఇలాంటి చెడి పోయిన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. వేసవిలో అప్పుడే వండిన ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బ్యాక్టీరియా ఆహారంపైకి వచ్చినప్పుడు అలాంటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వేసవికాలంలో చాలా మంది టూర్లకు వెళ్తుంటారు.. సాయంత్రం వేళ స్ట్రీట్ ఫుడ్స్, బార్బెక్యూలు వంటి వాటిలో తింటుంటారు. ఇలా బయట ఉండే బ్యాక్టీరియా ఆహార పదార్థాలపైకి చేరుతుంది…

అలాగే మాంసంలోని బ్యాక్టీరియా కూరగాయలకు, వాటిపై ఉండే క్రీములు మరోదానిపైకి చేరి ఆహారం కలుషితం చేస్తాయి. అలాంటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం పెరుగుతుంది. ఇది వేసవిలో మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.. ఇకపోతే కలుషిత నీరు తాగడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు పెరుగుతాయి. వేసవిలో ప్రయాణాలు చేసేటప్పుడు, క్యాంపింగ్ చేసినప్పుడు.. సరస్సులు, నదులు, బావులు, జలపాతాళ వద్ద నీటిని తాగడం వల్ల ఈకోలి, సాల్మోనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా కడుపులోకి చేరుతుంది. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ కావొచ్చు.వేసవికాలంలో ఫుడ్ పాయిజనింగ్ తీవ్రమైన సమస్య. అయితే ఫుడ్ పాయిజనింగ్ ను నివారించవచ్చు కూడా. ఆహారం కలుషితం కాకుండా చూసుకోవడం, బయట ఆహారాన్ని తినకపోవడం, వంట వండేటప్పుడు సరిగ్గా ఉడికించడం, కలుషిత నీరు తాగకపోవడం వంటి సరైన చర్యల వల్ల బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లకుండా చూసుకోవాలి.. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు..