Leading News Portal in Telugu

Chandrababu: ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబుకు బిగ్‌ షాక్‌..



Chandrababu

Chandrababu: ఫైబర్‌ నెట్‌ కేసులో పీటీ వారెంట్‌కు విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతించింది. సోమవారం చంద్రబాబును వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచాలని పేర్కొంది. ఫైబర్‌ నెట్‌ కేసులో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు వాదనలు విన్నది. చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని సీఐడీ న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించగా.. పీటీ వారెంట్‌కు అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది.

Also Read: Botsa Satyanarayana: కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టారాజ్యంగా మాట్లాడటం అలవాటుగా మారింది..

స్కిల్‌ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ ఉంది. ఈ క్రమంలో సోమవారం వ్యక్తిగతంగా చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇదిలా ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు వెల్లడించింది.