
Ratna Pathak Shah: ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఏడాదికి ఒకరు వస్తున్నారు కానీ.. హీరోలు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటున్నారు. స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు 60 దాటినా కూడా హీరోలుగానే నటిస్తున్నారు. ముఖ్యంగా కుర్ర హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తూ అభిమానులను మెప్పించడానికి ట్రై చేస్తున్నారు. ఇక అలా మెప్పించే తరుణంలో చాలామంది హీరోలు.. తమ కూతురు వయసున్న , మనవరాలు వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇది చూసేవారికి చాలా ఎబ్బెట్టుగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇది కేవలం టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ఉంది. ఇక ఈ విషయమై నటి రత్న పాఠక్ షా తన అభిప్రాయాన్ని తెలిపింది. లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా, ఖుబ్సూరత్, కపూర్ అండ్ సన్స్, చార్లీ చోప్రా లాంటి సినిమాలలో నటించి మెప్పించిన ఆమె తాజాగా ధక్ ధక్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. ప్రమోషన్స్ లో పాల్గొన్న రత్న వయస్సు తేడా గురించి మాట్లాడింది.
Jawan: రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా.. ఓటిటీలోకి వచ్చేస్తుంది..?
” హీరోలు.. తమకన్నా చిన్న వయసున్న హీరోయిన్లతో.. అది కూడా తమ మనవరాలు, కూతురు వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేయడం చాలా సిగ్గుగా అనిపిస్తుంది. అయితే.. చేసేవారికి సిగ్గు లేకపోతే.. నేనేం మాట్లాడగలను? నేను చెప్పడానికి ఏం లేదు. దీని గురించి మాట్లాడటం నాకే సిగ్గుగా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితి ముందు ముందు రాదు అనుకుంటున్నాను. ఇప్పుడు అమ్మాయిలు ఆర్థికంగానిలదొక్కుకుంటున్నారు. ఇక ఈ విషయాన్నీ కూడా వారు కచ్చితంగా మారుస్తారు అని అనుకుంటున్నాను” అని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.