Leading News Portal in Telugu

D K Shivakumar: బీజేపీ, జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో 40 మంది.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..


D K Shivakumar: బీజేపీ, జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో 40 మంది.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..

D K Shivakumar: కర్ణాటక రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ముఖ్యంగా బీజేపీ ఓట్ షేర్ అలాగే ఉన్నా, జనతాదళ్ సెక్యులర్(జడీఎస్) ప్రభావం దారుణంగా పడిపోయింది. దీంతో జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, ఆయన కుమారుడు మాజీ సీఎం కుమారస్వామి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ రెండు పార్టీల పొత్తును ఆ పార్టీల్లోనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. బీజేపీ, జేడీఎస్ పార్టీల నుంచి 40 మంది వరకు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని గురువారం ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున శిరహట్ట సెగ్మెంట్ ననుంచి పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ నిరాకరించిన మాజీ ఎమ్మెల్యే రామప్పలమాని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సమావేశంలో డీకే శివకుమార్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, నేను వారి పేర్లను వెల్లడించాలని అనుకోలేదని, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. స్థానిక నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఉత్తరాన బీదర్ నుంచి దక్షిణాన చామరాజనగర వరకు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. బీజేపీ-జేడీఎస్ పొత్తును వ్యతిరేకిస్తూ ఈ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని డీకే శివకుమార్ అన్నారు.